Vijay Deverakonda Movie in OTT : ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత కెరీర్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఈ చిత్రం తర్వాత ఆయన హీరో గా నటించిన సినిమాల్లో ‘టాకీ వాలా’ ఒక్కటే కమర్షియల్ గా పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో ఆడింది. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. లైగర్ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించాడు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత విడుదలైన ‘ఖుషి’ చిత్రం యావరేజ్ గా ఆడగా, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన ఆశలన్నీ ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం పైనే పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్రం పై ట్రేడ్ లో అంచనాలు ప్రస్తుతానికి భారీగానే ఉన్నాయి. అలాంటి ఈ సినిమాని నేరుగా ఓటీటీ లోనే విడుదల చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులను కలవర పెడుతుంది. అదేంటీ మొన్ననే కదా జులై 31 న గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నాము అని మేకర్స్ ప్రకటన చేశారు, ఇప్పుడేంటి డైరెక్ట్ ఓటీటీ అంటున్నారు అని మీకు అనుమానాలు రావొచ్చు. కానీ అసలు విషయానికి వస్తే ఈ నెల 31 న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే థియేటర్స్ లో విడుదల అవుతుంది. హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కావడం లేదు. థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక ఓటీటీ లో ఎప్పుడైతే ఈ సినిమా వస్తుందో, అప్పుడే మిగిలిన మూడు భాషల్లో మనం ఈ సినిమాని చూడొచ్చు.
Also Read: సనాతన ధర్మం కాన్సెప్ట్ మీదనే ‘హరి హర వీరమల్లు’.. యూత్ ఆడియన్స్ ఆదరిస్తారా?
అంటే బాలీవుడ్ ఆడియన్స్ కి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసే అదృష్టం లేదు అన్నమాట. నేరుగా ఓటీటీ లో చూసుకోవడమే. మన టాలీవుడ్ లో ఉన్న హీరోలలో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న అతి తక్కువమందిలో ఒకరు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు హిందీ లో ఒక్క సినిమా కూడా చేయలేదు, కానీ అర్జున్ రెడ్డి చిత్రం తో ఆయనకు బాలీవుడ్ లో మంచి రీచ్ వచ్చింది. ‘కింగ్డమ్’ చిత్రం తన కెరీర్ బెస్ట్ అవుతుంది అని ఆయన బలమైన నమ్మకం తో ఉన్నాడు. ఇలాంటి సమయం లో ఈ చిత్రం హిందీ వెర్షన్ కి థియేట్రికల్ రిలీజ్ లేకపోవడం పెద్ద దెబ్బనే. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మూవీ ని ఒక్క భాషలో పూర్తి చేయడానికే మూవీ టీం చాలా కష్టపడుతుంది అట. నెట్ ఫ్లిక్స్ సంస్థ జులై లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని పట్టుబట్టడం తో విడుదల చేస్తున్నారు తప్ప,మూవీ టీం కి ఆగష్టు లో రావాలని ఉందని సమాచారం.
