https://oktelugu.com/

New Phones From Poco: పోకో నుంచి మార్కెట్లోకి కొత్త ఫోన్లు.. చాలా చీప్ ధరతో అందుబాటులో..

స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో Poco కంపెనీ నుంచి 5జీ ఫోన్ తాజాగా విడుదలయింది. డిసెంబర్ 17న పోకో నుంచి C75 అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం మొబైల్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.15,000 వెచ్చించాల్సిందే.

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2024 / 01:09 PM IST

    Poco-Phone

    Follow us on

    New Phones From Poco:స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో Poco కంపెనీ నుంచి 5జీ ఫోన్ తాజాగా విడుదలయింది. డిసెంబర్ 17న పోకో నుంచి C75 అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం మొబైల్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.15,000 వెచ్చించాల్సిందే. కానీ లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఈ మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుడా ఇందులో ఉండే ఫీచర్స్ మిగతా మొబైల్స్ కు గట్టి పోటీ ఇస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉందంటే?

    దేశ రాజధాని న్యూ ఢిల్లీలో Poco c75 5G మొబైల్ ను లాంచ్ చేశారు. ఈ మొబైల్ లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరీజీని ఇచ్చారు. డిసెంబర్ 17న లాంచ్ చేసినా.. ఇది డిసెంబర్ 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయించనున్నారు. సోనీ కెమెరాను కలిగి ఉన్న మొట్ట మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఈ మొబైల్ 6.88 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంది. 4 ఎస్ జనరేషన్ 2 చిప్ సెటప్ తో ఉన్న స్నాప్ డ్రాగన్ ఫోన్ ఇది. అయితే దీనికి 64 జీబీ స్టోరీజ్ ఇచ్చినా.. 128 వరకు పెంచుకునే అవకాశం ఉంది. ప్రతీ ఫోన్ లో కెమెరా పనితీరును కచ్చితంగా చూస్తారు. ఈ కొత్త పోకో ఫోన్ లో 50 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరాను అమర్చారు. అలాగే సెకండరీ లెన్స్ కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 పిక్సల్ రిసల్యూషన్ తో పనిచేస్తుంది. ఇక ఫోన్ ఛార్జింగ్ కోసం ఇందులో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.

    ఇదే కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ ను కూడా ఆవిష్కరించారు. అదే పోకో M7 5G. ఈ మొబైల్ లో 6.67 అంగుళాల హెచ్ డి డిస్ ప్లే ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ కలిగి ఉన్న ఈ మొబైల్ మీడియా టెక్ డైమెన్షన్, 7025 అల్ట్రా చిప్ సెట్ ను అమర్చారు. ఇందులో 8 జీబీ ర్యామ్ ఉంటుంది. 128 తో పాటు 250 జీబి స్టోరేజీని కలిగి ఉంది. ఈ మొబైల్ లో 5,1160 బ్యాటరీ ఉండనుంది. ఇది 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ అవుతుంది. M7 5G మొబైల్ లో బ్యాక్ కెమెరా 50 మెగా పిక్సల్ ఉండనుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగా పిక్సల్ తో పనిచేస్తుంది.

    Poco C75 5G మొబైల్ రూ.7,999 లకు విక్రయించనున్నారు. మరో మోడల్ M7 5G రూ.13,999నుంచి రూ. 15,999 వరకు విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరకు లేటేస్ట్ టెక్నాలజీ కలిగిన ఫోన్ ఇదేనని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోకో మొబైల్ కు ఆదరణ ఉందని, వీటిని కూడా ఆదరిస్తారని అంటున్నారు.