https://oktelugu.com/

Megastar Chiranjeevi : ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ లో పాల్గొనబోతున్న మెగాస్టార్ చిరంజీవి..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి రెండో ఛాన్స్!

7 పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ, వాళ్ళతో సమానంగా డ్యాన్స్, ఫైట్లు చేస్తున్న హీరో మెగా స్టార్ చిరంజీవి.

Written By:
  • Vicky
  • , Updated On : December 19, 2024 / 01:08 PM IST

    Megastar Chiranjeevi

    Follow us on

    Megastar Chiranjeevi : 7 పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ, వాళ్ళతో సమానంగా డ్యాన్స్, ఫైట్లు చేస్తున్న హీరో మెగా స్టార్ చిరంజీవి. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లో కూడా ఆయన ఈ స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఉన్నాడు. రీ ఎంట్రీ తర్వాత మన స్టార్ హీరోలందరికంటే ముందుగా ఆయనే వంద కోట్ల రూపాయిల షేర్ ని అందుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా ఆయన వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి చేరాడు. అందుకే మెగాస్టార్ ని ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ అని అందరూ అంటూ ఉంటారు. ‘ఆచార్య’ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇక చిరంజీవి పని అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన ఫెయిల్యూర్ ని ఒక పండగలా చేసుకున్నారు. కట్ చేస్తే 5 నెలల్లోనే ‘వాల్తేరు వీరయ్య’ తో మాస్ కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాడు.

    గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను రాబట్టింది. దాదాపుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టి, మెగాస్టార్ మాస్ ని మరోసారి నేటి తరం ఆడియన్స్ కి రుచి చూపించింది. ఇలా తన పని అయిపోయింది అని అనుకున్న ప్రతీసారి గూబ గుయ్ అనేలా కొట్టడం చిరంజీవి కి నాలుగు దశాబ్దాల నుండి వెన్నతో పెట్టిన విద్య లాగ మారిపోయింది. అయితే ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ తో చిరంజీవి మరోసారి చేతులు కలపబోతున్నాడట. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఇటీవలే చిరంజీవి ని కలిసి స్టోరీ ని వినిపించగా, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరో పక్క చిరంజీవి తో సినిమా చేయడానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నాడు.

    ఈయనతో కూడా చిరంజీవి సినిమా చేసేందుకు అమితాసక్తి చూపించాడు. ఆయన చెప్పిన కథ కూడా మెగాస్టార్ కి బాగా నచ్చిందట. వచ్చే ఏడాదిలో ఈ రెండు సినిమాల షూటింగ్స్ మొదలు కానున్నాయి. అయితే ఒకదాని తర్వాత ఒక సినిమా మొదలయ్యే అవకాశాలు ఈసారి లేవు. రెండు సినిమాలను సమాంతరం గా చేయబోతున్నాడట మెగాస్టార్. రీ ఎంట్రీ తర్వాత ఆయన ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ , ‘భోళా శంకర్’ వంటి చిత్రాలను సమాంతరంగా చేసాడు. వీటిల్లో ‘గాడ్ ఫాదర్’ చిత్రం ఒక్కటే యావరేజ్ గా ఆడింది. మిగిలిన రెండు సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఈసారి అలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదట. ఎందుకంటే రెండు సినిమాల కథలు వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని మరోసారి వెండితెర మీద చూపించే విధంగా ఉండబోతున్నాయట. వీటిలో ఒక సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.