https://oktelugu.com/

Second-Hand Car: కొత్త కారు.. సెకండ్ హ్యండ్ కారు.. ఏది కొంటే బెటర్?

నేటి కాలంలో సొంత కారు కలిగి ఉండడం కామన్ అయిపోయింది. కరోనా తరువాత ప్రయాణాలు చేయడానికి..ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లడానికి సొంతంగా వెహికల్ ఉండాలని అనుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 26, 2024 / 10:10 AM IST
    Follow us on

    Second-Hand Car: నేటి కాలంలో సొంత కారు కలిగి ఉండడం కామన్ అయిపోయింది. కరోనా తరువాత ప్రయాణాలు చేయడానికి..ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లడానికి సొంతంగా వెహికల్ ఉండాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బడ్జెట్ ఉన్నవాళ్లు ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ హ్యాచ్ బ్యాక్ కార్ల గురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే చాలా మందికి కొత్త కారు కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ సరైన బడ్జెట్ లేకపోవడంతో ఉపయోగించిన కార్లను కొనుగోలు చేస్తారు. కానీ కొంత మంది నిపుణులు చెబుతున్న ప్రకారం కొత్త కారును కొనుగోలు చేయాలని అంటున్నారు. అయితే కొత్త కారు కొంటే మంచిదా? లేక యూజ్డ్ కారు బెటరా? ఎవరు? ఏ కారు కొంటే ఇబ్బందులు ఉండవు? ఎలాంటి కారు కొంటే ఇబ్బందులు ఉంటాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    కారు కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంత మంది మాత్రమే ఈ విషయంలో ముందడుగు వేస్తారు. ప్రధానంగా కారు కొనాలని అనుకున్నప్పుడు వారికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో గుర్తించాలి. ఒకవేళ కారు తప్పనిసరి అయితే ముందుకు వెళ్లాలి. కార్యాలయాలు, రెగ్యులర్ గా ప్రయాణాలు చేయాలని అనుకునేవారు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఒక వ్యక్తికి కారు అవసరం ఉన్నా.. వారు పనిచేసే కంపెనీలు, సంస్థలు ప్రత్యేకంగా కారు కోసం బడ్జెట్ కేటాయించరు. దీంతో కొత్త కారు కొంటే దానీ ఈఎంఐ భారం అవుతుంది. ఒకవేళ కారు ఖర్చులు అందించినా.. కొన్నాళ్ల పాటు వెయిట్ చేసి బడ్జెట్ సమకూరగానే కొత్త కారును కొనుగోలు చేయొచ్చు.

    ఫ్యామిలీతో కలిసి దూర ప్రయాణాలు చేయాలని అనుకునేవారు సొంతంగా కారు ఉండాలని అనుకుంటారు. ఇలాంటి వారు రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు కారు బయటకు తీస్తుంటారు. అంతేకాకుండా కుటుంబంతో కలసి ప్రయాణాలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని భావిస్తారు. ఇలాంటి వారు కొత్త కారును కొనుగోలు చేయడమే మంచిది. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కారులో ఏవో సమస్యలు ఉంటాయి. ఇవి దూర ప్రయాణాలు చేసినప్పుడే బయటపడుతాయి. అందువల్ల ఫ్యామిలీ అవసరాలకు అయితే కొత్త కారు బెటర్.

    కారు కొనాలని అనుకునే సమయంలో బడ్జెట్ ను అంచనా వేయడం ప్రధానం. కొందరు తమ దగ్గర బడ్జెట్ లేకున్నా.. బ్యాంకు రుణం తీసుకొని కారు కొనుగోలు చేస్తారు. ఈ పద్ధతి ట్రావెల్ ఏజెన్సీ వారికి వర్కౌట్ అవుతుంది. కానీ సరదాగా కారు కొనాలని అనుకునేవారు బ్యాంకు రుణంతో పొందడం వల్ల వాటి ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడుతారు. అంతేకాకుండా కారు కొనడం మాత్రమే కాదు. దీని మెయింటనెన్స్ కు రెగ్యులర్ గా ఖర్చులు ఉంటాయి. దీనికి సరిపోయే ఆదాయం వస్తుంది.. అన్నప్పుడే కారును కొనుగోలు చేయాలి. లేకుంటే అప్పుల పాలై తిపప్పలు పడుతారు. అందువల్ల కారును కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు వారి అవసరాలు, బడ్జెట్ ను ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి.