Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డితో బీజేపీని కొట్టే టీఆర్ఎస్ ప్లాన్?

Rajagopal Reddy: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మేరకు కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే తెలుస్తోంది. దీంతో తెలంగాణలో బీజేపీ విస్తరణకు ఆ పార్టీ నాయకులకు మరో అవకాశం దొరికినట్లయింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా వాటిని బీజేపీ […]

Written By: NARESH, Updated On : July 27, 2022 7:38 pm
Follow us on

Rajagopal Reddy: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మేరకు కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే తెలుస్తోంది. దీంతో తెలంగాణలో బీజేపీ విస్తరణకు ఆ పార్టీ నాయకులకు మరో అవకాశం దొరికినట్లయింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా వాటిని బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఈ నియోజకవర్గంలో పాగా వేయడానికి బీజేపీ మరో స్కెచ్ వేస్తుందా..? అనే చర్చ సాగుతోంది.

Rajagopal Reddy

గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేసింది. తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహించగా బీజేపీ గెలుపొందింది. 2019 నుంచి రెండు ఉప ఎన్నికలు నిర్వహించగా రెండింటినీ బీజేపీ గెలుచుకోవడం విశేషం. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ తన ప్రతాపం చూపించింది. దాదాపు మెజారిటీకి దగ్గరగా సీట్లను గెలుచుకుంది. అయితే ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పాచిక పారలేదు. కానీ అనూహ్య పరిణామాల మధ్య టీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. దీంతో హూజూబాద్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది.

Etela Rajendra

బీజేపీలో చేరాలంటే అప్పటి వరకు ఉన్న పదవులను త్యజించాలన్న పద్ధతిని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హూజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీపోటీ మధ్య విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేస్తున్నారు. ఇక ఇటీవల బీజేపీ జాతీయ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై సందడి చేశారు. ప్రధాన మంత్రి తెలంగాణ గురించి మాట్లాడి ఆకట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలో చేరికలు ప్రోత్సహించాలని నిర్ణయించారు. చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించారు. ఎంతో కాలంగా బీజేపీపై అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆ పార్టీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుంచి కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఈ వ్యాఖ్యలపై పలు సందర్భాల్లో కొట్టి పారేశారు. అయితే తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు ఏకంగా ఢిల్లీకి వెళ్లడంతో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది.

Also Read: YS Vivekananda Reddy: మూడున్నరేళ్లవుతున్నా కొలిక్కిరాని వివేకా హత్య కేసు.. అందుకు కారణాలు అవేనా?

తెలంగాణలో పాగా వేయాలని ఇప్పటికే ఆవురావురు మంటూ ఎదురుచూస్తున్న బీజేపీ నాయకులకు రాజగోపాల్ రెడ్డి రూపంలో అస్త్రం దొరికినట్లయింది. రాజగోపార్ రెడ్డి చేత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మరోసారి బీజేపీ తరుపున పోటీ చేయించనున్నారు. దీంతో బీజేపీ తన వ్యూహంతో ఆయనను గెలిపించుకోవాలని చూస్తోంది. ఒకవేళ బీజేపీ తరుపున రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి తిరుగులేదని చాటి చెప్పనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ఉప ఎన్నిక బాగా లాభిస్తుందని బీజేపీ అధిష్టానం అనుకుంటోంది.

అయితే కొన్ని సందర్భాల్లో తన పదవికి రాజీనామా చేయనని, ఉప ఎన్నిక రానివ్వనని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కానీ బీజేపీ నాయకులకు మాత్రం రాజగోపాల్ రెడ్డి చేత తన పదవిని వదిలించి ఆ తరువాత మళ్లీ పోటీ చేయంచనున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ మీటింగ్ తరువాత ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయోనని తెలంగాణ ప్రజానీయం ఎదురుచూస్తోంది. అటు తెలంగాణ బీజేపీ నాయకులు ఏం జరుగుతోందోని ఉత్కంఠతో ఉన్నారు.

Also Read: Bheemla Nayak Heroine: ‘భీమ్లా నాయక్‌’ హీరోయిన్ కి త్రివిక్రమ్ సపోర్ట్, కారణం ఏమిటి ?

Tags