Shakuntalam: ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్లైనా తమ భాషలో కాకుండా ఇతర భాషలో సినిమా చేయడమంటే చాలా కష్టం. ముఖ్యంగా డైలాగ్‌లు చెప్పేటప్పుడు వారు పడే బాధ వర్ణనాతీతం. అందులోని ఇంటెన్సిటీ అర్థం చేసుకుని.. భావాలను పలికిస్తూ చప్పడమంటే మాములు విషయం కాదు. తాజాగా, మలయాళ నటుు దేవ్ మోహన్ మాత్రం ఇటీవలే తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుని.. ఎంత కష్టమైన ఇష్టంగా భరిస్తానని చెప్పారు. తాజాగా, గుణశేఖర్ దర్శకత్వంలో తెలుగులో రానున్న సినిమా శాకుంతలం. ఇందులో దుష్యంతుడి పాత్ర చేస్తున్నారు దేవ్ మోహన్. ఈ క్రమంలోనే తెలుగులో తన డబ్బింగ్ పూర్తిచేసుకున్నారు. సమంత కీలక పాత్రలో కనిపిస్తోన్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
mohan-dubbing-work-completed-for-shakuntalam-movie
Also Read: ప్రభాస్ “రాధే శ్యామ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్… ఎప్పుడు, ఎక్కడో తెలుసా
గుణశేఖర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి. ఆ సినిమా తర్వాత మళ్లీ పురాణ గాథతో దిల్‌రాజుతో కలిసి గుణశేఖర్ కుమార్తె నీలిమా ఈ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్ సమయంలో దేవ్ మోహన్ తన పాత్రలో ఒదిగిపోయారో.. అంతే నిబద్దతతో ఇప్పుడు డబ్బింగ్ చేసి తమను అబ్బురపరిచాడంటూ నిర్మాతలు తెలిపారు.
ప్రస్తుతం దేవ్‌మోహన్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని.. ఇటీవలే సమంత డబ్బింగ్ కూాడా పూర్తయిందని పేర్కొన్నారు. భారీ అంచనాల మధ్య నెలకొన్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.