https://oktelugu.com/

Krithi Shetty: బేబమ్మకు బెడ్ సీన్ కామనైపోయిందే…!

Krithi Shetty: అదృష్టం తలుపు తడితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో సెటిల్ కావచ్చు. ఏళ్లకు ఏళ్ళు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా కొందరు స్టార్స్ అనతికాలంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. అలాంటి లక్కీ హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. ఈ కన్నడ భామ ఉప్పెన మూవీతో కుర్ర హృదయాలను నిండా ముంచేసింది. అమ్మడు క్యూట్ లుక్స్ కి తెలుగు కుర్రోళ్ళు దాసోహం అంటున్నారు. కృతి శెట్టికి ఉప్పెన మొదటి […]

Written By:
  • Shiva
  • , Updated On : December 15, 2021 / 10:51 AM IST
    Follow us on

    Krithi Shetty: అదృష్టం తలుపు తడితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో సెటిల్ కావచ్చు. ఏళ్లకు ఏళ్ళు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా కొందరు స్టార్స్ అనతికాలంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. అలాంటి లక్కీ హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. ఈ కన్నడ భామ ఉప్పెన మూవీతో కుర్ర హృదయాలను నిండా ముంచేసింది. అమ్మడు క్యూట్ లుక్స్ కి తెలుగు కుర్రోళ్ళు దాసోహం అంటున్నారు. కృతి శెట్టికి ఉప్పెన మొదటి చిత్రం కాగా… సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది.

    Krithi Shetty

    హోమ్లీగా కనిపించే కృతి శెట్టి తన సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోవడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి చిత్రంలోనే శృంగార సన్నివేశంలో పాల్గొన్న కృతి.. రెండో మూవీలో కూడా ఆ సాంప్రదాయం కొనసాగించారు. నడి సముద్రంలో వైష్ణవ్ తేజ్, కృతిపై తెరకెక్కిన బోల్డ్ సాంగ్ యువతను గిలిగింతలు పెట్టింది. కథలో కీలకమైన ఆ సాంగ్.. సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఫస్ట్ మూవీలోనే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఒప్పుకోవడం సాహసమే అని చెప్పాలి.

    అయితే ఉప్పెనలో కథ కోసం తప్పలేదనుకుంటే.. శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా అలాంటి బోల్డ్ సన్నివేశంలో నటించి షాక్ ఇచ్చింది. నిన్న విడుదలైన శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లో నాని, కృతి శెట్టి మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్స్ ని కూడా మించిపోయేలా కృతి విచ్చలవిడిగా ముద్దుల సన్నివేశంలో నటించారు. దీంతో ఉప్పెన తరహాలో… శ్యామ్ సింగరాయ్ చిత్రంలో కూడా కృతి శెట్టి నుండి ఓ బోల్డ్ సన్నివేశం ఆశించవచ్చని, ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

    ఇక కృతి తీరు చూసిన కొందరు బేబమ్మకు బెడ్ సీన్ కామనైపోయిందే అని కామెంట్ చేస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశానికైనా నేను రెడీ అన్నట్లు కృతి చెప్పకనే చెబుతుంది. కారణం ఏదైనా ఇది ఆమె ఫ్యాన్స్ ని సంతోషపరిచే విషయమే. దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ తెరకెక్కించిన శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీలో నాని మోడరన్, పీరియాడిక్ పాత్రలు చేస్తున్నారు.

    Also Read: Shyam Singha Roy: మనమే విజేతలం అంటే ఎలా నాని ?

    ఉప్పెన మూవీ విడుదల తర్వాత కృతి శెట్టి వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారు. ఆమె నాగ చైతన్యకు జంటగా బంగార్రాజు మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ లో నాగలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు. అలాగే సుధీర్ కి జంటగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం చేస్తున్నారు. ఇంకా నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం, హీరో రామ్ తో మరొక చిత్రం చేస్తున్నారు. మరి ఈ చిత్రాలలో కూడా బేబమ్మ కలిసొచ్చిన సీన్ లో రెచ్చిపోతుందేమో చూడాలి.

    Also Read: Katrina Kaif: పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు కత్రీనా – విక్కీ…

    Tags