JanaSena Plenary: ఏపీలో ( Andhra Pradesh) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేన అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆ పార్టీ ప్లీనరీ మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని భావించారు. అందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ఉన్నపలంగా ఆ మూడు రోజులను ఒక్క రోజుకు కుదిరించడం ఆశ్చర్యం కలుగుతోంది. అయితే దీనిపై జనసేన నాయకత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ మంత్రుల ప్రకటనలు చూస్తే మాత్రం ఒక్క రోజుకు మాత్రమే పరిమితం అవుతుందని తెలుస్తోంది. దీనిపై పార్టీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మూడు రోజులు పాటు నిర్వహించామని.. అధికారంలోకి వచ్చిన తరువాత ఒకరోజు చేయడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* గతంలో వేడుకగా..
జనసేన( janasena ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలతో పాటు మెగా అభిమానులు తరలి వచ్చేవారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో ఉర్రూతలూగించేవారు. ఈ ఏడాది విజయం సాధించిన తర్వాత ఆవిర్భావ దినోత్సవాన్ని కాస్త ప్లీనరీగా మార్చారు. తొలుత మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎందుకో ఒక్కరోజు అని సంకేతాలు వస్తున్నాయి. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ దీనిపై రివ్యూ నిర్వహిస్తున్నారు. అటు మరో మంత్రి దుర్గేశ్ సైతం సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 14న జరిగే ప్లీనరీ అంటూ సంబోధిస్తున్నారు. దీంతో కార్యక్రమం ఒక్క రోజుకే పరిమితం అవుతుందని తేలిపోయింది.
* పవన్ వెన్నునొప్పి కారణం
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) జరుగుతున్నాయి. ఈనెల 19 వరకు కొనసాగనున్నాయి. అయితే మధ్యలో మూడు రోజులపాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తే.. రాజకీయ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందికరంగా మారనుంది. అందుకే ప్లీనరీని ఒక రోజుకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ప్లీనరీ మూడు రోజులపాటు నిర్వహిస్తే వేదికపై పవన్ నిరంతరాయంగా కూర్చోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే దానిని ఒక రోజు కార్యక్రమం గా మార్చేసినట్లు తెలుస్తోంది.
Also Read: పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. వెంటనే అప్లయ్ చేయండి!