Chanakya Niti: జీవితంలో గొప్పగా ఎదగాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. ఇలా లక్ష్యాన్ని ఛేదించినవారికి వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు అలవర్చుకుంటే వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారని కొందరు నమ్ముతారు. అయితే మరికొందరు మాత్రం వీటిని కాకుండా చెడు లక్షణాలను కలిగి ఉంటారు. ఇలా ఉండడం వల్ల జీవితంలో ఎదగక పోవడమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందిగా తయారవుతారు. అయితే చాణక్య నీతి ప్రకారం ప్రతి మనిషి మూడు లక్షణాలను కలిగి ఉంటే వారు ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తారు. ఇంతకీ ఆ మూడు లక్షణాలు ఏంటి? వాటిని ఎలా అలవర్చుకోవాలి?
పుట్టగానే ఎవరూ మేధావులు కారు. జీవితంలో ఎన్నో అనుభవాలు పొందిన తర్వాతే అసలైన జీవితం ప్రారంభమవుతుంది. అయితే మనము ఒకటి కావాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కానీ కొందరు ఏ లక్ష్యం లేకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. వీరిలో సోమరితనం ఎక్కువగా ఉంటుంది. సోమరితనం ఉన్నవారు ఎప్పటికీ ఏది సాధించలేరు. సోమరితనం వల్ల ఒక పనిని చేపట్టిన దానిని మధ్యలోనే వదిలేస్తారు. అది పూర్తి చేసే వరకు శ్రమించరు. అందువల్ల జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకునేవారు సోమరితనాన్ని వీడాలి. అప్పుడే విజేతగా నిలుస్తారు.
మనసు మాట వినదు అని కొందరు అంటూ ఉంటారు. కానీ మనసు అదుపులో ఉన్నప్పుడే మన ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటాయి. అలాంటప్పుడు చేసే పని ఏదైనా వెంటనే పూర్తి కావడానికి సహకరిస్తాయి. అందువల్ల మనసును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనసుతో ఆలోచిస్తూ.. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మంచిగా చేయాలని అనుకుంటే అనుకున్న పని కచ్చితంగా పూర్తి అవుతుంది. అందువల్ల మనసు ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
ప్రతి మనిషికి డబ్బు కంటే జ్ఞానం చాలా ముఖ్యం. డబ్బు అందరి వద్దా ఉంటుంది కావచ్చు. కానీ జ్ఞానం అందరి వద్ద ఉండదు. జ్ఞాన సముపార్చన కోసం రకరకాల ప్రయత్నాలు చేయాలి. పుస్తకాలు, మేధావుల చరిత్రలు చదవడం వల్ల ఎంతో జ్ఞానం వస్తుంది. అలాగే అందమైన ప్రదేశాలను సందర్శించడం వల్ల జ్ఞానం సాధించవచ్చు. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని అనుకునేవారు జ్ఞానాన్ని పొందే మార్గం పెంచుకోవాలి. తెలివి ఉన్నవారు ఎప్పటికైనా విజేతలుగా మారుతారు.
ఇలా ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటే ఆ వ్యక్తి ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారని చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా పేర్కొన్నారు. అపర చాణిక్యుడు రాజనీతి శాస్త్రం లోనే కాకుండా ఒక వ్యక్తి ఎదుగుదలకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పారు. అందులో ఒక మనిషి విజేతగా మారాలంటే తాను ఎలాంటి అలవాట్లు ఉంచుకోవాలో పేర్కొన్న పడ్డారు. ముఖ్యంగా ఈ అలవాట్లు ఉన్నవారు కచ్చితంగా లైఫ్లో సక్సెస్ సాధిస్తారని చాణక్యుడు చెప్పారు. అందువల్ల ఈ లక్షణాలను అలవర్చుకొని లక్ష్యాలను ఛేదించే ప్రయత్నం చేయండి.