Medaram Jatara 2022: సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. నేటి నుంచి మూడు రోజుల పాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వన దేవతల ఆగమనానికి సమయం ఆసన్నమైంది. బుధవారం సారలమ్మ గద్దెకు రానుంది. వన జాతర జన జాతరగా మారుతోంది మేడారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఘనంగా జాతర నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశాఉ. దీంతో అన్ని దారులు సమ్మక్క వైపే సాగుతున్నాయి.
మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గిరిజనులు ఇక్కడకు చేరుకుంటారు. మేడారం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. దాదాపు కోటి మంది భక్తులు దేవతలను సందర్శించుకుంటారు. నిన్నటి వరకు యాభై లక్షల మంది వచ్చినట్లు అదికారులు తెలిఆరు. ఈ నేపథ్యంలో మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర కోసం జనం భారీ మొత్తంలో విచ్చేస్తున్నారు. మాఘశుద్ధ గడియల్లో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు రెండేళ్లకోసారి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మన రాష్ర్టంతో పాటు ఒడిశా, చత్తీస్ గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల్లో వస్తుంటారు. వారి కోసం ఏర్పాట్లు కూడా చేశారు. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కిలోమీటర్ల మేర వాహనాల పార్కింగ్ కు పటిష్ట చర్యలు తీసుకున్నారు. దీంతో మేడారం జాతర కోసం అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.
Also Read: షర్మిల అరెస్టుతో ఏం జరుగుతోంది?
ఈనెల 17న సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తారు. దేవతను తీసుకొచ్చే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. దీంతో మేడారం జాతర సంరంభం కొనసాగుతుంది. దీనికి గాను అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. తాగునీరు, వైద్యం లాంటి అత్యవసర సేవలను కూడా అందుబాబులో ఉంచారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.
వాహనాల పార్కింగ్ కు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఎలు వైపు నుంచి వచ్చే వాహనాలను అటు వైపే నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పార్కింగ్ సమస్య లేకుండా చేశారు. మరోవైపు జాతరలో దొంగతనాల నివారణకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం గస్తీ తిరుగుతూ దొంగతనాల నివారణకు సహకరిస్తున్నారు.
Also Read: రేపటి నుంచే మేడారం మహాజాతర.. తల్లుల కోసం పోటెత్తిన జనం.. విశేషాలివీ