History of Film: ప్రపంచంలో మొదటి సినిమా ఎప్పుడు ఎక్కడ ఎలా తీశారు ?

History of Film: సినిమా అనేది మానవ జీవితంలో ఓ భాగం అయిపోయింది. మరి ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రం ఏమిటి ? అసలు సినిమాని ఎలా కనిపెట్టారు ? మొదటి సినిమాగా ఏది వచ్చింది ? ఇలాంటి అనేక విషయాల పై ఆసక్తి ఉంటుంది. మీకు తెలుసా ? రౌండ్‌ హౌస్ గార్డెన్ సీన్స్ అనేది మొదటి సినిమా. 1888 లో ఫ్రెంచ్ లూయిస్ లే ప్రిన్స్ అనే వ్యక్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ […]

Written By: Shiva, Updated On : February 16, 2022 1:26 pm
Follow us on

History of Film: సినిమా అనేది మానవ జీవితంలో ఓ భాగం అయిపోయింది. మరి ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రం ఏమిటి ? అసలు సినిమాని ఎలా కనిపెట్టారు ? మొదటి సినిమాగా ఏది వచ్చింది ? ఇలాంటి అనేక విషయాల పై ఆసక్తి ఉంటుంది. మీకు తెలుసా ? రౌండ్‌ హౌస్ గార్డెన్ సీన్స్ అనేది మొదటి సినిమా. 1888 లో ఫ్రెంచ్ లూయిస్ లే ప్రిన్స్ అనే వ్యక్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

History of Film

ఈ సినిమాని ఇంగ్లాండ్‌ లో షూట్ చేశారు. ఈ మొదటి చిత్రం 1.66 సెకన్ల పాటు సాగింది. అయితే, ప్రసిద్ధి చెందిన మొదటి చిత్రం లూమియర్ సోదరులు తీసిన “లా సియోటాట్ స్టేషన్’. ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ లాంటిది. దీన్ని 1895 లో చిత్రీకరించారు. ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రం చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఫీల్ అయ్యారట.

Also Read: : 500 ఏళ్ల క్రితం ఇండియాలో కారం బదులు ఏమి వాడే వారో తెలుసా ?

ప్రేక్షకులు తమ సీట్ల నుండి దూకి పారిపోయాట. అందుకే.. ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రం యొక్క ప్రభావం నిజంగా అద్భుతమైనది. ప్రేక్షకులు తమ సీట్ల నుంచి దూకించింది మొదటి సినిమా. ఆ తర్వాత లూమియర్ సోదరుల “ది వాటర్డ్ వాటరర్” అనే మరొక చిత్రం తీశారు. మొదటి చిత్రాల స్వల్ప వ్యవధి సినిమాలగానే వచ్చాయి.

History of Film

అయితే, 1900 ల ప్రారంభంలో, చిత్రాల పొడవు క్రమంగా 20 నిమిషాలకు పెరిగింది. అయితే, సౌడ్ తో వచ్చిన మొట్టమొదటి చిత్రం “జాజ్ సింగర్”, ఈ మోషన్ పిక్చర్ నిశ్శబ్ద చిత్రాలకు ముగింపు పలికింది కూడా.

ఇక మొదటి కలర్ ఫుల్ చిత్రాలు విషయానికి వస్తే..

మొట్టమొదటి పూర్తి-నిడివి గల కలర్ సినిమా “బెక్కి షార్ప్”. ఇది 1925 లో విడుదలైంది. మొత్తానికి కొంతమందికి మాత్రమే పరిమితం అయిన సినిమా.. నేడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి చేరింది. ఈ ఆధునిక ప్రపంచంలో సినిమా పాత్ర అద్భుతం. ప్రతి వ్యక్తి వారానికి కనీసం ఒక సినిమా అయినా చూస్తాడు. అంతగా సినిమా మనలో భాగం అయిపోయింది.

Also Read:  విషాదం : ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

Tags