https://oktelugu.com/

Vishwak Sen: అశోకవనంలో విశ్వక్‌ సేన్ కొత్త సాంగ్ అదిరింది

Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. కాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ నుంచి తొలిసాంగ్ విడుదలైంది. ‘ఓరోరి సిన్నవాడా సిన్నవాడా గగ్గోలు పడకోయి పిల్లగాడా’ అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 4న సినిమాను విడుదల చేయనున్నారు. ఇక లేటు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 16, 2022 / 11:41 AM IST
    Follow us on

    Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. కాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ నుంచి తొలిసాంగ్ విడుదలైంది. ‘ఓరోరి సిన్నవాడా సిన్నవాడా గగ్గోలు పడకోయి పిల్లగాడా’ అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. ఇక మార్చి 4న సినిమాను విడుదల చేయనున్నారు.

    Vishwak Sen

    ఇక లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా సాగుతున్న టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. అన్నట్టు ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. అయితే ఈ సినిమా టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ సాంగ్ ను రిలీజ్ చేసింది.

    Also Read: నేడే మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తుతున్న భక్తులు

    కాగా ఈ ‘అశోకవనంలో అర్జున కల్యాణం ‘సినిమా సాంగ్ నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక హీరో విశ్వక్‌ సేన్‌ రీసెంట్ గా కరోనా వ్యాధికి గురై.. కోలుకున్నాడు. ఈ సినిమా పైనే తన హోప్స్ అన్నీ పెట్టుకున్నాడు. లాస్ట్ సినిమా పాగల్ కూడా భారీ ప్లాప్ అయింది. దాంతో విశ్వక్‌ సేన్‌ కి ఈ సినిమానే కీలకం అయింది.

    Vishwak Sen

    మరి విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? సినిమాలో మ్యాటర్ మాత్రం చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది. కాబట్టి.. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిద్దాం.

    Also Read: ప్రపంచంలో మొదటి సినిమా ఎప్పుడు ఎక్కడ ఎలా తీశారు ?

    Tags