మజ్‌గావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ 425 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తులను కోరుతోంది. పైప్ ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కోపా, వెల్డర్, ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.ఆన్ లైన్ లో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆగష్టు 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎనిమిది, పది, ఐటీఐ సంబంధిత ట్రేడుల్లో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో కంప్యూటర్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉండగా గ్రూపులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముంబై, నాగ్‌పూర్, పుణె, ఔరంగాబాద్ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభిస్తుందని తెలుస్తోంది. వరుసగా వెలువడుతున్న జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.