https://oktelugu.com/

వైఎస్ వివేకాను చంపిందెవరో జగన్ కు తెలుసు!?

రాయలసీమ రాజకీయాలే చాలా ఫ్యాక్షన్ గా ఉంటాయి. నరుక్కోవడాలు.. చంపుకోవడాలు.. పగలు, ప్రతీకారాలు.. ఇలా సినిమాల్లో చూపించినట్టే క్షేత్రస్థాయిలో ఉంటాయి. ఈ మధ్యన కాస్త తగ్గినా అప్పట్లో మాత్రం సీమ నెత్తురు ఇప్పుడు విరజిమ్మేది. ఇక 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా సీమ ఫ్యాక్షన్ మరోసారి రాజుకుంది. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కలకలం రేపింది. దీనిపై సిట్ ఏర్పాటు చేసినా.. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2021 / 09:43 PM IST
    Follow us on

    రాయలసీమ రాజకీయాలే చాలా ఫ్యాక్షన్ గా ఉంటాయి. నరుక్కోవడాలు.. చంపుకోవడాలు.. పగలు, ప్రతీకారాలు.. ఇలా సినిమాల్లో చూపించినట్టే క్షేత్రస్థాయిలో ఉంటాయి. ఈ మధ్యన కాస్త తగ్గినా అప్పట్లో మాత్రం సీమ నెత్తురు ఇప్పుడు విరజిమ్మేది.

    ఇక 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా సీమ ఫ్యాక్షన్ మరోసారి రాజుకుంది. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కలకలం రేపింది. దీనిపై సిట్ ఏర్పాటు చేసినా.. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తున్నా ఆ హత్యకు కారకులు ఎవరన్నది మాత్రం ఇప్పటీకీ తేలడం లేదు.

    తాజాగా సునీల్ యాదవ్ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు ఈ హత్య కేసులో అరెస్ట్ చేశారు. అయితే అతడు పులివెందులలో ఒక సాధారణ వ్యక్తి అని.. బలమైన వైఎస్ కుటుంబ సభ్యుడిని చంపేంత ధైర్యం, తెగువ అసలు సునీల్ యాదవ్ కు లేవని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తన చిన్నాన్న వైఎస్ వివేకాను చంపింది ఎవరో సీఎం జగన్ కు తెలుసు అని బీటెక్ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను తప్పించేందుకు సీఎం జగన్ ప్రణాళిక వేశారని ఆరోపించారు. గతంలో హత్య జరిగినప్పుడు ఉన్న కడప ఎస్పీ అభిషేక్ ను మహంతి దీర్ఘకాలిక సెలవులో పంపించారని.. ఇప్పుడు విచారిస్తున్న సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ ను దర్యాప్తు నుంచి తప్పించడం చూస్తుంటే ఈ కేసును సీఎం ప్రణాళికబద్దంగా నీరుగారుస్తున్నారని అర్తమవుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. అసలు నిందితులను తప్పించేందుకు సీఎం జగన్ ముందుకెళుతున్నారని ఎమ్మెల్సీ రవి విమర్శలు గుప్పించారు.

    తాజాగా బీటెక్ రవి చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ఈ ఆరోపణలు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.