ప్రస్తుత కాలంలో చాలామంది సమయాన్ని ఆదా చేసుకోవాలనే అలోచనతో ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారు. అయితే ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన అన్నం తినడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జీవన ప్రమాణాలను పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం, ఆ పాత్రల్లో నిల్వ చేయడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆహారం వండే సమయంలో గాలి తగిలేలా చూసుకోవాలని అలా చూసుకోకపోతే ఆహారం హానికరంగా మారుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. స్వల్ప కాలంలో ఏ ఆరోగ్య సమస్యల బారిన పడకపోయినా దీర్ఘకాలంలో కరెంట్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారం తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కొంతమందిని కీళ్లవాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ లో వంట చేయకుండా ఉంటేనే మంచిదని చెప్పవచ్చు. అత్యవసరం అయితే మాత్రమే ఎలక్ట్రిక్ కుక్కర్ ను ఉపయోగిస్తే మంచిదని చెప్పవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకోవడానికి చాలామంది సమయం కేటాయించడం లేదు.
మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేవారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో పాటు ఎన్నో లాభాలు కలుగుతాయి.