https://oktelugu.com/

OG Movie Updates : ఓజీ’ నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్..కేవలం 4 రోజుల్లోనే అవుట్!

ఒక వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ మీద కొన్ని క్లోజప్ షాట్స్ ని మంగళగిరి లో వేసిన సెట్స్ లో తీస్తారట. ఆ తర్వాత మరో వారం రోజుల పాటు ముంబై లో షూటింగ్ చేయనున్నారు. ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత బ్యాంకాక్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తియ్యాల్సి ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 7, 2024 / 02:59 PM IST

    OG Movie Update

    Follow us on

    OG Movie Updates : పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’. ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్స్ కూడా ఈ సినిమాలో మూడు తరాలకు సంబంధించినట్టుగా ఉంటుంది. సాల్ట్ & పెప్పర్ లుక్ లో కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల సమయం ఇస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. ముందుగా మార్చి 28 వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు కానీ, ఆ తేదీన పవన్ కళ్యాణ్ మరో చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదల అవ్వబోతుంది.

    దీంతో ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా, సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుండి ఇచ్చినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 23 వ తారీఖు నుండి ఆయన ‘హరి హర వీరమల్లు’ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ షూటింగ్ ఈ నెల 23 వ తారీఖు వరకు కొనసాగనుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నాడు. అక్టోబర్ 11 నుండి మళ్ళీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. షూటింగ్ మొత్తం మంగళగిరి లో వేసిన సెట్స్ లోనే చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓజీ చిత్రం షూటింగ్ కూడా ఇక్కడే జరగనుంది. ఒక వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ మీద కొన్ని క్లోజప్ షాట్స్ ని మంగళగిరి లో వేసిన సెట్స్ లో తీస్తారట. ఆ తర్వాత మరో వారం రోజుల పాటు ముంబై లో షూటింగ్ చేయనున్నారు. ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత బ్యాంకాక్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తియ్యాల్సి ఉంటుంది.

    దీనికి సెట్స్ వేయడానికి కుదరదు. కచ్చితంగా బ్యాంకాక్ కి వెళ్లే తీయాలి. అందుకు కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కానీ షూటింగ్ ని అక్కడ కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాలని డైరెక్టర్ సుజిత్ కి షరత్తు పెట్టాడట పవన్ కళ్యాణ్. పని దినాలు తక్కువే అయినప్పటికీ, ఎక్కువ గంటలు పని చేస్తానని చెప్పాడట పవన్ కళ్యాణ్. గతం లో కూడా పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కోసం పగలు, రాత్రి పని చేసేవాడు . రోజుకి దాదాపుగా అలా 14 గంటలు పని చేసేవాడట పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రి అయ్యాడు, అప్పటి స్థాయిలో ఇప్పుడు కూడా ఎక్కువ పనిగంటలు షూటింగ్ చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికే ఈ చిత్ర నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.