KTR vs KCR: శీర్షిక చదివి ఇదేదో మా సొంత ప్రయోగం అనుకునేరు. ఈ మాట అన్నది స్వయంగా కేటీఆరే. అదేంటి కేటీఆర్ అంత మాట అన్నారా? ఔను ఆయనే అన్నారు. తనను కలిసిన పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన ఆ మాట మాట్లాడారు. ఆయన ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మల్కాజ్ గిరి శాసనసభ సభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అంతేకాదు పోలీసులపై ఒక రేంజ్ లో రెచ్చిపోయారు.. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. సీఐలు, ఏసీపీలు ఎవరెవరైతే ఎగిరి పడుతున్నారో.. వారందరి సంగతి చూద్దామని.. తాను గులాబీ పార్టీ అధినేత లాగా మంచోడిని కాదని.. ఆయన చెప్పినా కూడా విననని కేటీఆర్ స్పష్టం చేయడం ఆ వీడియోలో విశేషం.
Also Read: కవితక్కకు దారేది?
ఇప్పుడే కాదు గత కొద్దిరోజులుగా కేటీఆర్ వ్యవహార శైలి ఇలాగే ఉంటున్నది. అధికార పక్షం మీద, పోలీసుల మీద ఆయన ఒంటి కాలు మీద లేస్తున్నారు. సమయం, సందర్భం తో పని లేకుండానే తిట్టడాన్నే పనిగా పెట్టుకుంటున్నారు. ఏకవాక్య సంబోధనతో ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు.. హౌలే, చెప్పుతో కొడతా, సన్నాసి, ఏం పీక్కుంటావో పీక్కో.. ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ నుంచి వచ్చిన బూతు పురాణం మామూలుగా లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు.. ఇక్కడేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాషితాలు మాట్లాడుతున్నారని కాదు.. ఇటువంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాలలో ఎటువంటి దారుణాలకు దారితీస్తాయో ఊహించుకోడానికే భయంగా ఉంది.. వాస్తవానికి తెలంగాణలో ఒకప్పుడు రాజకీయాలు ఇంత దారుణంగా ఉండేవి కావు. కానీ ఇటీవల కాలంలో నాయకులు శృతిమించి పోతున్నారు. సమయం, సందర్భంతో పని లేకుండానే తిట్టడాన్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
ఇటీవల ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కల్వకుంట్ల తారక రామారావును అధికారులు పలుమార్లు విచారించారు. విచారణకు హాజరయ్యే క్రమంలో బల ప్రదర్శన చేపట్టారు. ఎక్కడెక్కడ నుంచో నేతలను తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. వాస్తవానికి కేటీఆర్ ఏ తప్పూ చేయకుంటే ఈ స్థాయిలో బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ప్రశ్నించారు. కేటీఆర్ మాత్రమే కాదు, కెసిఆర్ కాలేశ్వరం విచారణకు హాజరైన సమయంలోనూ ఇదే స్థాయిలో బల ప్రదర్శన చేపట్టారు. ఇక ఇటీవల కల్వకుంట్ల తారకరామారావు పై ఆయన సోదరి పలు సందర్భాల్లో వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం ఇష్టం ఉండదని.. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర రావును మాత్రమే తాను పార్టీ సారధిగా అంగీకరిస్తానని కవిత స్పష్టం చేశారు. కేటీఆర్ తో విభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు.. అంతకుముందు లేఖలు బయటపడిన విషయంపై కవిత ఘాటుగానే స్పందించారు.
Also Read: ఈ ఐదుగురు జర్నలిస్టులపై పడిపోతున్నారు
ఇటీవల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష స్థానంలో కవితని కాకుండా కొప్పుల ఈశ్వర్ ను కేటీఆర్ నియమించడం.. వారిద్దరి మధ్య ఉన్న విభేదాలను ప్రస్ఫుటంగా బయట పెట్టింది. మరోవైపు బిసి ఆర్డినెన్స్ విషయంలో కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జై కొట్టగా.. గులాబీ పార్టీ మాత్రం వ్యతిరేకించడం మొదలు పెట్టింది. అంతేకాదు చివరికి పార్టీ తన లైన్లోకి రావాలని ఆమె స్పష్టం చేసింది.. ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టే కేటీఆర్ ప్రతి సందర్భంలోనూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. అసహనంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు వివరిస్తున్నారు.
#KCR చెప్పిన వినను.. నేను అంత మంచోడిని కాదు.
ఏసీపీలు, డీసీపీలు, సీఐలు, ఎస్సైలు ఎవడెవడు ఎగురుతున్నారో అందరి పేర్లు రాసుకోండి ఈసారి @KCRBRSPresident చెప్పిన వినను.. మీరు ధైర్యం కోల్పోవద్దు – @KTRBRS pic.twitter.com/BfnrBxekge
— Anitha Reddy (@Anithareddyatp) July 18, 2025