Trending journalists in Telugu: మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ తీవ్రస్థాయిలో యుద్ధం చేసేవి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాయకూడని భాషలో.. చెప్పకూడని విధంగా వీడియోలు పోస్ట్ చేసేవి..పెయిడ్ బాట్స్ తో విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేయించేవి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని.. కాంగ్రెస్ నేతలను పక్కనపెట్టిన గులాబీ సోషల్ మీడియా హ్యాండిల్స్ సరికొత్త దారిని ఎంచుకున్నాయి.. ఎంచుకోవడం మాత్రమే కాదు, ఆల్రెడీ పని కూడా మొదలుపెట్టాయి.
Also Read: జగన్ కు షాక్.. వైసీపీకి సీనియర్ నేత గుడ్ బై?
గులాబీ సోషల్ మీడియా హ్యాండిల్స్ టీవీ5 సీఈవో మూర్తి, ఏబీఎన్ వెంకటకృష్ణ, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, మా టీవీ అధినేత వంశీ, టీవీ5 సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి.. వారి పెయిడ్ బ్యాచ్ ద్వారా అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయి. వీరంతా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని.. తెలంగాణలో ఉండుకుంటూ.. తెలంగాణ ప్రాంతంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేయిస్తున్నాయి.. వీరంతా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తుందని మండిపడుతున్నాయి. ఇటీవల ఈ మీడియా సంస్థలలో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. ఆ కథనాలను జీర్ణించుకోలేక ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇలాంటి వ్యతిరేక ప్రచారానికి దిగాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తమపై వస్తున్న వ్యతిరేక కధనాలను జీర్ణించుకోలేక ఇటీవల మహా టీవీ కార్యాలయం పై గులాబీ పార్టీ నాయకులు దాడులు చేశారని.. గతంలో గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఇటీవల క్యూ న్యూస్ కార్యాలయం పై దాడులు చేశారని గుర్తు చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొంటున్నారు.
Also Read: లోకేష్.. కేటీఆర్.. కలయిక కథేంటి?
వివిధ మీడియా సంస్థల చెందిన కీలక వ్యక్తులను ఇలా సోషల్ మీడియాలో విమర్శించడం ద్వారా ఏం సాధిస్తారని గులాబీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులను ప్రశ్నిస్తున్నందువల్లే తట్టుకోలేకపోతున్నారని.. అందువల్లే ఇలాంటి ఎదురు దాడులకు దిగుతున్నారని.. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. ట్విట్టర్ లో ఏదో ఒకటి పోస్ట్ చేయడం.. పెయిడ్ బ్యాచ్ తో కామెంట్లు చేయించడం పరిపాటిగా మార్చుకున్నారని మండిపడుతున్నారు. ” గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్న చానల్స్ లో ప్రభుత్వంపై ఒక్క సానుకూల కథనం కూడా రాదు. అలాంటప్పుడు అందులో పని చేసేవారిని కూడా మేము ఇదే స్థాయిలో విమర్శించాలి కదా.. కేవలం ఈ చానల్స్ మాత్రమే తెలుగులో లేవు కదా. మిగతా ఛానల్ లో పనిచేసేవారిని ఇందులో ప్రస్తావించ లేదంటే వారంతా కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారన్నటే కదా.. అలాంటప్పుడు వీరిని గులాబీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎందుకు ప్రశ్నిస్తారు.. అసలు ఇటువంటి దిక్కుమాలిన విధానాలకు తెరలేపింది గులాబీ పార్టీ కదా.. అలాంటప్పుడు మిగతా వారిని గులాబీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎలా ప్రశ్నిస్తారని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.