Kavitha Political Future: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో కలకలం సృష్టించాయి. దీంతో ఆధిపత్యపోరులో ఎవరి వైపు ఎవరుంటారనే చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ ను సమర్థిస్తూ సంబరాలు చేసుకోవడం, దాన్ని ప్రశ్నిస్తూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం, ఆవిషయంలో పార్టీ తనకు మద్దతు ఇవ్వకోవడంపై ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఇంకా ముదిరింది. అయితే తాను పార్టీలో ఉండలేక, మరో పార్టీలో చేరలేక, కొత్త పార్టీ పెట్టలేక అంతర్గత మథనం కొనసాగుతోంది.
వెనుదన్నుగా కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక భూమిక నిర్వహించారు. తదనంతరం కేటీఆర్ రాజకీయ రంగప్రవేశంతో పార్టీలో తన ప్రాభవం తగ్గినట్లు భావిస్తున్నారు. పార్టీ ప్రధాన నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర నిభాయించిన ఆమె తండ్రి ఇచ్చిన బలంతో ఎదురులేని శక్తిగా పార్టీలో ఎదిగారు. పార్టీ పరిస్థితుల గురించి గ్రౌండ్ రియాలిటీస్ తెలిసిన కవిత కు పెద్దాయన కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతారు. అయితే రెండో టర్మ్ ఎన్నికల సందర్భంగా తిరిగి పోటీ చేసిన కవిత అదే పార్లమెంట్ పరిధిలో ఓటమి చవిచూడడం పార్టీలో ప్రాధాన్యత విషయంలో వెనుకబడ్డారు. ఆ సమయంలో కేటీఆర్ వర్గం ఆయన్ను ముఖ్యమంత్రి చేసే అవకాశాలున్నాయని అంతర్గతంగా ప్రచారం చేయడం. మీడియా కూడా ఆ విషయాన్ని హైప్ చేయడంతో దాదాపు నెల రోజుల పాటు అంతర్గతంగా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించే పనిలో పడిన కేసీఆర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, ఎవరు ఈ విషయంపై మాట్లాడినా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో కవిత, కేసీఆర్ ను ప్రభావితం చేసి ఉండవచ్చని కూడా కథనాలు వెలువడ్డాయి. కేటీఆర్ ఆ సమయంలో సీఎం కాకుండా అడ్డుగా నిలిచింది కవితనే అని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. కవిత మొదటిసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన తరువాత ఆ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఆమెకు
Also Read: గ్లాసులో సోడా పోసినట్టు.. కేసీఆర్ ను ఇలా కూడా తిడతారా?
ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్దతుగా నిలిచారు. ఆ తరువాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించి పార్టీ పగ్గాలు పగ్గాలు అప్పగించడం, ఆ తరువాత ఎన్నికలో పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
ఓటమికి కారణం పార్టీ నాయకులేనా.?
అయితే ఎంపీ ఎన్నికల్లో తన ఓటమికి పార్టీ నాయకులే కారణమని అనుచర, సహచర వర్గాలతో వ్యాఖ్యానించడం. తరువాత లిక్కర్ కేసులో ఉచ్చు బిగుసుకొని జైలు పాలవ్వడంతో జరిగింది. అయితే జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత కవిత మౌనంగా ఉంటుందని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జాగృతి నాయకులను తిరిగి కార్యోన్ముఖులను చేస్తూ తన ప్రాభవాన్ని చాటుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం పనిగా పెట్టుకున్నారు.
Also Read: ఏందీ ‘పంచాయితీ’ కవితక్కా!
సంచలనం సృష్టించిన లేఖ
ఈ కార్యక్రమాలకు బిఆర్ఎస్ నాయకులు హాజరుకాకపోవడంతో కూడా పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని పసిగట్టి, తండ్రి కేసీఆర్ కు పార్టీ పరిస్థితిపై సూచనలు అందిస్తూనే, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ రాయడం, ఆ లేఖ మీడియాకు బహిర్గతం కావడం, ఈ విషయంపై ఆమె సీరియస్ గా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని మీడియా ముందు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఒక సమయంలో కవిత కొత్తపార్టీ పెడుతుందని ప్రచారం జరిగింది. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు పార్టీలోని బలమైన శక్తులు ప్రయత్నం చేస్తున్నట్లు గ్రహించిన ఆమె ఇంకా దూకుడు ప్రదర్శిస్తూ, మరికొన్ని కార్యక్రమాలను తీసుకున్నారు. కానీ ఆమె దూకుడును తట్టుకోలేకనే ఆమె కాళ్ళలో పార్టీ పెద్దలే కట్టే పెడుతున్న ఈ సమయంలో కవిత ఏం నిర్ణయం తీసుంటుందోననే చర్చ, ఊహాగానాలు కుప్పలు, తెప్పలుగా వినిపిస్తున్నాయి.