Liquor Scam Investigation:మద్యం కుంభకోణం( liquor scam) కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక అరెస్టులు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో పాటు అధికారులు అరెస్టయ్యారు. ఇప్పుడు తాజాగా రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయడంతో.. ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు తప్పదని తేలిపోయింది. మరోవైపు మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు చార్జ్ షీట్ దాఖలు చేయనుంది. కేసులో పూర్వాపరాలను స్పష్టం చేయనుంది. అదే సమయంలో ఈరోజు సిట్ విచారణకు హాజరుకానున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన అరెస్టు కాయంగా కనిపిస్తోంది. విచారణ అనంతరం మిధున్ రెడ్డి అరెస్టు చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే మిధున్ రెడ్డి అరెస్ట్ కోసం సిట్ వారెంట్ జారీకి కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే ఈరోజు మొత్తంగా మిథున్ విషయంలో చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: తల్లికి వందనం డబ్బులు వెనక్కి.. ప్రభుత్వం కీలక ప్రకటన!
ఇప్పటికే కీలక అరెస్టులు..
మద్యం కుంభకోణానికి సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారి అరెస్టులు జరిగాయి. ప్రస్తుతం వారంతా రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే సిట్ పక్కా ఆధారాలను సేకరించింది. సూత్రధారి రాజ్ కసిరెడ్డి అయినా.. వెనుక ఉండి నడిపించింది మాత్రం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని పూర్తిస్థాయి ఆధారాలు సిట్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో సైతం సిట్ పక్కా ఆధారాలు చూపడం వల్లే.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు రద్దు చేసినట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతోనే మిధున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లు సమాచారం.
Also Read: ఈ ఐదుగురు జర్నలిస్టులపై పడిపోతున్నారు
విచారణ జరిగిన వెంటనే అరెస్ట్..
మరోవైపు మిధున్ రెడ్డి( Mithun Reddy) విచారణకు హాజరైన మరుక్షణం అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పరిశీలించిన కోర్టు.. సుప్రీంకోర్టు ఇచ్చిన మెమో.. ఇతర పత్రాలు జత చేయకపోవడానికి గుర్తించి రిటర్న్ వచ్చేసింది. సంబంధిత పత్రాలతో పిటిషన్ వేయాలని వెనక్కి పంపింది. దీంతో వాటిని జత చేసి మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని సిట్ ప్రయత్నాల్లో ఉంది. ముఖ్యంగా మిథున్ రెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు జరిపేందుకు, అరెస్టు చేసేందుకు చట్ట ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం.
చుట్టూ అష్టదిగ్బంధనం..
ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team ) మిథున్ రెడ్డి విషయంలో అష్టదిగ్బంధనం చేసింది. కోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. అలాగని విదేశాలకు వెళ్లే ఛాన్స్ లేకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈరోజు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. ఆయన తప్పకుండా హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు షిఫ్ట్ ఏర్పాటు చేసుకుంది. 300 పేజీలతో ఈరోజు ఈ కేసుకు సంబంధించి చార్జి షీట్ విడుదల చేయనుంది సిట్. అయితే ఇప్పటివరకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ఒక స్పష్టత వచ్చింది. అయితే ఈరోజు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఫుల్ క్లారిటీ రానుంది. అయితే ఎంపీ మిధున్ రెడ్డికి ఒకవైపు.. వైసిపి హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి ఇంకోవైపు విచారణకు హాజరుకావాలని సిట్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఈరోజు జరగబోయే పరిణామాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి.