ఆస్ట్రేలియాలో ఇండియా- ఆసీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరిస్ లో భాగంగా బుధవారం మూడో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లి 23 పరుగులు చేసి సచిన్ వన్డే 12 వేల రికార్డును బ్రేక్ చేశాడు. 250 వన్డేల్లోనే కోహ్లి సచిన్ రికార్డును అధిగమించడం గమనార్హం. దీంతో కోహ్లి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఆదివారం సిడ్నీలో 22,000 పరుగులు సాధించిన కోహ్లి 12,000 చేసిన వేగవంతమైన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు 43 సెంచరీలు, 59 అర్ధ సెంచరీలు ఆయన రికార్డులో ఉన్నాయి.