రిస్క్ లేకుండా డబ్బు రెట్టింపు చేసే ఛాన్స్.. ఎలా అంటే..?

మనలో చాలామంది మన దగ్గర ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్లలో డబ్బులు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉన్నా అదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే రిస్క్ చేస్తే లాభాలు వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయో నష్టాలు వచ్చే అవకాశాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఒక పని చేస్తే మాత్రం రిస్క్ లేకుండా ఖచ్చితమైన లాభం పొందే అవకాశం ఉంటుంది. Also Read: తెలుగు రాష్ట్రాల్లో […]

Written By: Kusuma Aggunna, Updated On : December 2, 2020 6:48 pm
Follow us on


మనలో చాలామంది మన దగ్గర ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్లలో డబ్బులు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉన్నా అదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే రిస్క్ చేస్తే లాభాలు వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయో నష్టాలు వచ్చే అవకాశాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఒక పని చేస్తే మాత్రం రిస్క్ లేకుండా ఖచ్చితమైన లాభం పొందే అవకాశం ఉంటుంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ’కార్తీక‘ పూజలు

కస్టమర్ల కోసం పోస్టాఫీస్ లు ఎన్నో రకాల స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ లు అమలు చేస్తున్న స్కీమ్ లలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి. కస్టమర్లు ఎవరైతే ఈ స్కీమ్ ను ఎంచుకుంటారో వాళ్లు అదిరిపోయే ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఒక్కసారి డబ్బులు కట్టి మెచ్యూరిటీ సమయం వరకు ఎదురు చూస్తే ఈ స్కీమ్ ద్వారా సులభంగా రెట్టింపు డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.

Also Read: డిసెంబర్ 1 నుంచి ఏటీఎం కొత్త నిబంధనలు.. వాళ్లకు మాత్రమే..?

పోస్టాఫీసులు వికాస్ కిసాన్ పత్ర స్కీమ్ పై ప్రతి సంవత్సరం 6.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పది సంవత్సరాలలో మనం డిపాజిట్ చేసిన డబ్బుకు రెట్టింపు డబ్బును పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ను ఎంచుకున్న వారికి సంవత్సరానికి ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో నగదు జమవుతుంది. ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే రెండు లక్షలు, 5 లక్షలు డిపాజిట్ చేస్తే 10 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: జనరల్

18 సంవత్సరాల వయస్సు పై బడిన వాళ్లు కనీసం 1,000 రూపాయలు డిపాజిట్ చేసి ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు. అయితే కస్టమర్లు ఎవరైనా 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖాతాలలో జమ చేయాలనుకుంటే మాత్రం పాన్ కార్డును అందజేయాల్సి ఉంటుంది.