మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలను తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాలను వేగంగా అమలులోకి తెస్తున్నాయి. టెక్నాలజీని వినియోగించుకుని కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాలంటే ఫోన్ లో లేదా ఆన్ లైన్ లో మాత్రమే బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది.
Also Read: రిస్క్ లేకుండా డబ్బు రెట్టింపు చేసే ఛాన్స్.. ఎలా అంటే..?
అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దాదాపు అన్ని మార్కెటింగ్ కంపెనీలు కస్టమర్ల కోసం వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఫెసిలిటీని అందిస్తూ ఉండటం గమనార్హం. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ను వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని భావిస్తే మొదట గ్యాస్ సిలిండర్ కంపెనీ నంబర్ ను మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి.
Also Read: డిసెంబర్ 1 నుంచి ఏటీఎం కొత్త నిబంధనలు.. వాళ్లకు మాత్రమే..?
సేవ్ చేసుకున్న నంబర్ కు వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొరకు రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ చేసుకున్న కొన్ని సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుకింగ్ అయినట్టు రిప్లై రావడంతో పాటు సిలిండర్ బుక్ అవుతుంది. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 నంబర్ ను సేవ్ చేసుకుని గ్యాస్ సిలిండర్ ను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344 నంబర్ ను మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకుంటే వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: జనరల్
సదరు కంపెనీల వాట్సాప్ ప్రొఫైల్ లోని సూచనల ఆధారంగా సులభంగా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ సూచనను పాటించడం ద్వారా క్షణాల్లో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయడం సాధ్యమవుతుంది. హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడే వాళ్లు 9222201122 నంబర్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వినియోగదారులు గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.