Jagan: పిక్‌ ఆఫ్‌ ది డే.. స్పెషల్‌ ఫ్లైట్‌ నుంచి.. సాధారణ విమానం వెనుక సీటు వరకు జగన్ పతనం..!

రాజకీయ నాయకులు జీవితాలను అధికారమే నిర్దేశిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం పోయాక మరోలా గడపాల్సి వస్తుంది. అధికారం జీవితాలను తారుమారు చేస్తుంది. తాజాగా ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత పరిస్థితి ఇలాగే ఉంది.

Written By: Raj Shekar, Updated On : ఆగస్ట్ 14, 2024 12:37 సా.

Jagan

Follow us on

Jagan: రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో అయితే ప్రజలే అధికార నిర్ణేతలు ఎవరిని అధికారంలో ఉంచాలి.. ఎవరు గద్దె దించాలి అని నిర్ణయించేది ప్రజలే. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో తీర్పును ఇస్తూ పార్టీలకు అధికారం అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. రాష్ట్ర విభజన 2014లో జరిగింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. టీడీపీని గద్దె దించి జగన్‌ నేతృత్వంలోని వైసీపీని గద్దెనెక్కించారు. తాజాగా 2024లో జరిగిన ఎన్నిల్లో మళ్లీ మార్పునే కోరుకున్నారు. దీంతో ఐదేళ్లు పాలించిన వైసీపీని ఓడించారు. ప్రతిపక్ష టీడీపీని గద్దెనెక్కించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కట్టబెట్టి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే టీడీపీ నేతలు వైసీపీపై ప్రతీకార దాడులు మొదలు పెట్టారు. వైసీపీ జెండాలు, బోర్డులు,పార్టీ కార్యాలయాలపై దాడి చేశారు. తర్వాత నేతలను టార్గెట్‌ చేశారు. ఇక వైసీపీ అధినేతపై అన్నిరకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. దీంతో ఆయన రాష్ట్రంలో కూడా ఉండడం లేదు. బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు..
జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించారు. చుట్టూ వందల మంది సెక్యూరిటీ ఉండేవారు. ఇప్పుడు పది మందికి పరిమితమయ్యారు. ఇక ఆయన వెంట ఎప్పుడూ నేతలు ఉండేవారు. ఇప్పుడు నలుగురైదుగురే కనిపిస్తున్నారు. ఇక కనీసం సెక్యూరిటీ పరంగా కూడా భద్రత కల్పించడం లేదు. నాసిరకం బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం సమకూరుస్తోంది. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సౌకర్యాన్ని బట్టి ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే అవకాశం ఉండేది. అతను తన వద్ద ఒక ప్రత్యేకమైన విమాన ప్రయాణ వ్యవస్థను కలిగి ఉండేవాడు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్‌ బలవంతపు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

ప్యాసింజర్‌ విమానంలో.. వెనక సీటులో..
ఇదిలా ఉంచితే, జగన్‌ ఈరోజు సాధారణ ప్యాసింజర్‌ విమానంలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదీ వెనుక సీటులో.. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోలో జగన్‌తోపాటు ఆయన భార్య భారతి ప్రయాణికులతోపాటు వెనుక సీటులో కూర్చుని ఉన్నారు. ప్రత్యేక అధికారాలు లేకుండా ఇతర సామాన్యుల వలె ప్రయాణిస్తున్నారు. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక విమానంలో ప్రయాణించే జగన్‌ ఇప్పుడు ప్యాసింజర్‌ విమానంలో వెనుక సీటులో ప్రయాణించడం చూసి ఇంతలో ఎంత మార్పు అంటూ నెటిజన్లు కాంమెంట్‌ చేస్తున్నారు.