NTR: తెలుగు సినిమా రంగ వైభవానికి ప్రతీకగా నిలిచిపోయారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా ఆయన కీర్తి నిలిచిపోయింది. పైగా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు ఎన్టీఆర్. మరి అలాంటి మహానటుడిని తలుచుకుని మురిసిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అనే పేరుని ఖరారు చేసింది ఆంధ్రపదేశ్ ప్రభుత్వం. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. దాంతో, ఆయన పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అనే పేరుని ఖరారు చేశారు. దాంతో జగన్ నిర్ణయాన్ని టీడీపీ నాయకులు కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, అందరూ మెచ్చుకున్నారు ఒక్క ఎన్టీఆర్ తప్ప. అందుకే, వైసీపీ సోషల్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తోంది.
Also Read: తెలుగు స్టార్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్… టాప్ లో నాగార్జున!
విజయవాడ జిల్లాకు తన తాతయ్య ఎన్టీఆర్ పేరు పెట్టడం పై తారక్ ఎందుకు ఇంకా స్పందించట్లేదు ? అంటూ, జగన్ ప్రభుత్వానికి ఎందుకు కృతజ్ఞతలు తెలపట్లేదు ? అంటూ పోస్టులు పెడుతున్నారు. తాతకు గౌరవం దక్కినందుకు కృతజ్ఞతాభావం చూపించవా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై తారక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం స్వాగతించారు.
మొత్తానికి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాని రెండుగా విడదీసి, విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. మరి ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు.
Also Read: ఊసరవెల్లి రంగులు మార్చడం వెనుక అసలు కారణం ఏంటో తెలిస్తే..!
.