తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తారు. వాళ్ళకి ఉండే మార్కెట్ కూడా చాలా ఎక్కువే కాబట్టి వాళ్ల సినిమాలను చూడడానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు…ఆయన ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన కూడా తనకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా దక్కలేదు. కారణం ఏంటంటే ఆయన ఎంచుకునే కథల్లో క్వాలిటీ ఉంటుంది. కానీ ఆయన సినిమాలను రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నారని చెబుతున్నారు. కారణమేదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇన్ని సంవత్సరాల తన ఇంటైర్ కెరియర్ లో ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా దక్కించుకోకపోవడం పట్ల నందమూరి అభిమానులతో పాటు తన ఫ్యాన్స్ సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు చేయబోతున్న ‘డ్రాగన్’ సినిమా విషయంలో ఆ లోటు తీర్చుకుంటానని చెబుతున్నాడు. 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ఈ సినిమా ఈజీగా నమోదు చేస్తుందని తద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఈ సినిమాను విపరీతంగా అలరించే అవకాశాలైతే ఉన్నాయంటూ ఎన్టీఆర్ తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడం పక్క అంటూ అభిమానులు సైతం కాలర్ ఎగరేస్తున్నారు. గత సంవత్సరం హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు.
ఇక ఎట్టకేలకు డ్రాగన్ సినిమాతో అయిన మరోసారి తను బౌన్స్ బ్యాక్ అవుతాడా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయగలిగే కెపాసిటి ఎన్టీఆర్ కి ఉందా లేదా అనే విషయం ఈ సినిమాతో తెలుస్తుంది…ఒకవేళ ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఎన్టీఆర్ పాన్ ఇండియాలో టాప్ హీరోగా మారిపోతాడు…
