Rajalakshmi Senthil Ganesh: వెండితెరపై ప్రస్తుతం మట్టి పాటల హవా కొనసా..గుతోంది. జానపద శైలిలో తమదైన గొంతుతో విలక్షణతను చాటుతున్న గాయనిలు వెండితెరపైన తమ పాటలతో అలరిస్తున్నారు. తమ గొంతును అందించి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో ఇదో ట్రెండ్ లాగా కొనసాగుతోంది. ‘రంగస్థలం’ పిక్చర్‌లో..‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా’, ‘పలాస 1978’ చిత్రంలోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’, ‘లవ్ స్టోరి’ ఫిల్మ్‌లోని ‘సారంగదరియా’ వంటి పాటలు ప్రేక్షకుల విశేష ఆదరణకు నోచుకున్నాయి. కాగా, ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లోని ‘సామీ సామీ’ సాంగ్ బాగా పాపులర్ అయింది.

తమిళ్ భాషలో ఈ పాటను రాజలక్ష్మి సెంథిల్ గణేశ్ పాడారు. తమిళనాట ఈ పాట సంచలనం అవతున్నది. పాట విని ప్రజలు ఆనందపడిపోతున్నారు. ఇకపోతే ఈ పాటలో రాజలక్ష్మి సెంథిల్ గణేశ్ హావభావాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. లిరికల్ రిలీజ్ వీడియోలో వీరి ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్ అవుతున్నాయి.
Also Read: తెలుగు స్టార్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్… టాప్ లో నాగార్జున!
లిరికల్ సాంగ్స్ ఇటీవల కాలంలో యూట్యూబ్ లో తెగ ట్రెండవుతున్నాయి. అలా అన్ని చిత్రాలకు మూవీ మేకర్స్ లిరికల్ రిలీజెస్ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రం నుంచి కూడా ‘సామీ..సామీ’ లిరికల్ వీడియో బాగా పాపులర్ అయింది. తమిళ్‌లో ‘వయ్యా సామీ..’లిరికల్ సాంగ్ లో రాజలక్ష్మి సెంథిల్ గణేష్ హావభావాలు చూసి తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. జానపద గాయని అయిన రాజలక్ష్మీ సెంథిల్ జానపద పాటలతో బాగా పాపులర్ అయింది. తాజాగా ఈ సాంగ్ తో తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది.
భార్యా భర్తలిద్దరూ.. రాజలక్ష్మి సెంథిల్ గణేశ్ ఫోక్ సింగర్స్ కావడం విశేషం. ‘తమిళ్ ఫోక్ మ్యూజిక్’ పేరిట వీరు చేసిన ఆల్బమ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. యూట్యూబ్‌లో వీరు పాడిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. విజయ్ టీవీలో ప్రసారమైన ‘సూపర్ సింగర్ 6’ కార్యక్రమంలో వీరు పాల్గొని అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇక ఆ తర్వాత వీరికి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. అలా వీరు తొలిసారిగా ‘చిన్నా మచన్’ అనే పాటను ‘చార్లీ చాప్లిన్2’మూవీలో పాడారు. ‘సెంథిల్ రాజలక్ష్మి’ అనే పేరుతలో వీరు యూట్యూబ్ చానల్ కూడా స్టార్ట్ చేశారు. అందులో తాము పాడిన పాటలు అప్ లోడ్ చేస్తుంటారు.
Also Read: చిన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్ ?