https://oktelugu.com/

భారత్ లో కరోనాతో ఒకరు మృతి

చైనాలో సోకిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. 120కిపైగా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 4వేలమందికి పైగా కరోనా బాధితులు మృత్యువాతపడగా, లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో 75కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు […]

Written By: , Updated On : March 13, 2020 / 12:58 PM IST
Follow us on

చైనాలో సోకిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. 120కిపైగా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 4వేలమందికి పైగా కరోనా బాధితులు మృత్యువాతపడగా, లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో 75కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతిచెందాడు. తాజాగా అతడికి కరోనా సోకినట్టు ఆ రాష్ట్ర అధికారులు గురువారం ప్రకటించారు. అయితే వృద్ధుడు మృతిచెందడానికి ముందు హైదరాబాద్‌లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిపారు. దీంతో వృద్ధుడు చికిత్స తీసుకున్న ఆసుపత్రి, వైద్య సిబ్బందిని పర్యవేక్షణలో ఉంచినటు్ల ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ జి శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో ఎవరికీ వైరస్‌ సోకినట్టు గుర్తించలేదని ఆయన తెలిపారు.

గతనెల 29న వృద్ధుడు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారిత కేసుల సంఖ్య 75కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి కరోనా మరణానికి హైదరాబాద్ తో సంబంధం ఉన్నట్టు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ఆసుపత్రుల్లో తగిన చర్యలు తీసుకోవాలని దేశాలు జారీ చేసింది. ప్రజలు భయాందోళన చెందకుండా ప్రభుత్వం అందించే సలహాలు, సూచనలు పాటించాలని కోరింది.