పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస మూవీలతో బీజీగా మారారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ మూవీ తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కుతుంది. ‘వకీల్ సాబ్’లో పవన్ కు జోడీగా గోవా సుందరీ ఇలియానా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నివేథా థామస్, అంజలి, అనన్య, నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ మూవీ కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
పవన్ ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. మొగల్ సామ్రాజ్య కాలంనాటి కథాంశంతో క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఇందులో బందిపోటుగా కనిపిస్తాడని సమాచారం. పవన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని చిత్రీకరించనున్నారు. దాదాపు 150కోట్ల రూపాయాల బడ్జెట్ తో నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో పవన్ సరసన ఇద్దరు భామలు నటించనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా క్రిష్ ఆస్థాన నటి ప్రజ్ఞ జైస్వాల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ తొలిసారి పీరియడ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కోహినూర్ డైమండ్ కోసం జరిగే ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలువనుందట. ఇందుకోసం స్టంట్ మాస్టర్లు ప్రత్యేకంగా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. చారిత్రక సెట్ల కోసం నిర్మాత భారీగానే ఖర్చు చేస్తున్నాడట. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా పవన్ ‘వకీల్ సాబ్’ మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు దిల్ రాజు, బోనికపూర్ సన్నహాలు చేస్తున్నారు.