కరోనా బారిన పడ్డ స్టార్ హీరో

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు సినిమా రంగానికి చెందిన వారిని కూడా వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష ముప్పైవేల మందికి ఈ వైరస్ ఎఫెక్ట్ కాగా వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు ఆయన సతీమణి రీటా విల్సన్ కు సైతం కరోనా వైరస్ సోకింది. ప్రఖ్యాత గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారం గా వార్నర్ బ్రదర్స్ […]

Written By: Neelambaram, Updated On : March 13, 2020 3:33 pm
Follow us on

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు సినిమా రంగానికి చెందిన వారిని కూడా వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష ముప్పైవేల మందికి ఈ వైరస్ ఎఫెక్ట్ కాగా వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

తాజాగా ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు ఆయన సతీమణి రీటా విల్సన్ కు సైతం కరోనా వైరస్ సోకింది. ప్రఖ్యాత గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారం గా వార్నర్ బ్రదర్స్ తీస్తున్న సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన టామ్ హాంక్స్ కి ఈ విపత్తు ఎదురైంది.

ఆస్ట్రేలియాలో ఉండగా చలి జ్వరం, నీరసం, ఒళ్ళు నొప్పులు రావడంతో టామ్ హాంక్స్ దంపతులు వైద్యులను సంప్రదించారట…ఆ క్రమంలో వారికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. దాంతో వైద్యుల పర్యవేక్షణలో ఉండి, వారి సూచనల్ని పాటిస్తున్నారట టామ్ హాంక్స్ దంపతులు. తమ సినిమా యూనిట్ సభ్యుల్లో కొందరికి కరోనా ఉండటం మూలంగానే టామ్ హాంక్స్, ఆయన భార్యకు కూడా కరోనా వైరస్ సోకినట్టు ఈ హాలీవుడ్ స్టార్ పి ఆర్ ఓలు .చెబుతున్నారు. Disease is a disease for all