Hug: కౌగిలింత అనేది చాలా మందికి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఎంత మానసిక వేదన చెందుతున్నా కూడా ఇష్టమైన వారిని కొన్ని సెకన్ల పాటు హగ్ చేసుకుంటే చాలు.. మనస్సులో ఉన్న బాధ మొత్తం తొలగిపోతుంది. కేవలం ఇష్టమైన వారు మాత్రమే కాకుండా.. బాధలో ఉంటే ఎవరైనా సరే ప్రేమగా ఒక చిన్న హగ్ ఇస్తే చాలు.. ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు. కౌగిలింత అనేది ఒకరి పట్ల ప్రేమను వ్యక్తపరిచే అత్యంత అందమైన అనుభూతి. ఏదైనా సమస్య వస్తే.. మనల్ని అర్థం చేసుకుని కౌగిలించుకునే వ్యక్తి ఉన్నవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక హగ్ వల్ల కేవలం మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొన్ని సెకన్ల హగ్ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. మీరు ఎప్పుడైనా శారీరకంగా, మానసికంగా ఏదైనా సమస్యతో సతమతం అవుతుంటే మాత్రం నచ్చిన వారిని హగ్ చేసుకోండి. ఇక మీకు అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతాయి.
మూడ్ బాగుంటుంది
కొందరు ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉంటారు. ఇలాంటి వారు ఇష్టమైన వారిని హగ్ చేసుకోండి. దీనివల్ల మీ మూడ్ మారుతుంది. బయటకు చెప్పలేని ఆందోళన, బాధ ఉంటే మాత్రం తప్పకుండా నచ్చిన వారిని హగ్ చేసుకోండి. దీనివల్ల హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. దీంతో మీ బాధలు అన్ని కూడా తొలగిపోతాయి.
ఒత్తిడి దూరం అవుతుంది
కొందరు ఎక్కువగా ఒత్తిడి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు నచ్చిన వారిని హగ్ చేసుకోండి. దీనివల్ల వారి శరీరంలో ఉన్న కార్డినాల్ తగ్గుతుంది. ఈ హార్మోన్ ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది.
రక్తపోటు నియంత్రణ
హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ మొత్తం శరీరానికి సరఫరా అవుతుంది. ఇష్టమై వారిని కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది శరీరానికి కాస్త విశ్రాంతి ఇస్తుంది.
గుండె ఆరోగ్యం
కౌగిలించుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటారు. అలాగే శరీరానికి కాస్త ప్రశాంతత కూడా ఉంటుంది.
మెదడు పనితీరు మెరుగుపడుతుంది
కౌగిలించుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.