Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే కొంతమంది మంచి విజయాలను సాధిస్తే మరి కొంతమంది మాత్రం సక్సెస్ లను సాధించడంలో చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది దర్శకులైతే వాళ్ళు చేసిన ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో వాళ్ళు చాలా క్రియాశీలక పాత్ర వహిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం మన స్టార్ డైరెక్టర్లు చాలా వరకు ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. ఇక అనిల్ రావిపూడి(Anil Ravipudi) లాంటి దర్శకుడు సైతం ఇండస్ట్రీ కి వచ్చి పది సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన చేసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక అనిల్ రావిపూడి ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపధ్యం లో వాళ్ల హోమ్ బ్యానర్ గా ఫీల్ అయిపోయే ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ (Sri Venkateshwara Creations) బ్యానర్ నుంచి దిల్ రాజు (Dil Raju) సైతం అనిల్ రావిపూడి కి కంగ్రాచ్యూలేషన్స్ తెలియజేస్తూ ఒక ట్వీట్ అయితే చేశారు… ఇక ఇప్పటీ వరకు ఆయన చేసిన 8 సినిమాల్లో మూడింటిని మినహాయిస్తే మిగిలిన 5 సినిమాలను కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఇక మిగిలిన సినిమాల్లో కొన్నింటికి తను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడం లాంటివి చేశాడు. మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తాయని తెలియజేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అనిల్ రావిపూడి దిల్ రాజు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు.
సంక్రాంతి ఫెస్టివల్ ని క్యాష్ చేసుకోవడంలో వీళ్ళు మిగిలిన దర్శకుల కంటే ముందు వరుసలో ఉండడం విశేషం…ఇక ఇప్పటికే ఈ సినిమా దాదాపు 200 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి వసూళ్లను రాబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా హౌజ్ ఫుల్ గా నడుసస్తుండటంతో రీసెంట్ నిర్వహించిన సక్సెస్ మీట్ లో దిల్ రాజు అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ ఆయన మా సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో చాలా క్రియా శీలకమైన పాత్ర పోషించాడు అంటూ అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు…ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను చిరంజీవి తో చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మీద కూడా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి…