మనలో చాలామంది స్టాక్ మార్కెట్ అనే పదాన్ని తరచూ వింటూ ఉంటారు. డబ్బు సంపాదించడానికి ఉన్న సులభమైన మార్గాల్లో స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. అయితే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడిగా పెట్టాలంటే మొదట కొన్ని బేసిక్ రూల్స్ పై అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్ లో లాభాలు పొందే అవకాశం ఎంత ఉంటుందో సరైన అవగాహన లేకపోతే నష్టపోయే అవకాశాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి.
Also Read: కారు కొనాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.4000తో కొత్త కారు మీ సొంతం!
పెట్టుబడిలో రిస్క్ తీసుకోగలం అనే ఉద్దేశం ఉంటేనే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలి. సరైన స్టాక్ ను ఎంచుకుంటే లాభం పొందే అవకాశాలు ఎంత ఉంటాయో రాంగ్ స్టాక్ ను ఎంచుకోవడం ద్వారా నష్టపోయే అవకాశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సాధారణంగా కంపెనీలు డివిడెంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. సంస్థలకు మంచి లాభాలు వస్తే సంస్థ నుంచి షేర్లు కొనుగోలు చేసిన వాళ్లకు సైతం భారీగా లాభాలు వస్తాయి.
Also Read: బాంకు కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు..?
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాల్లో పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ గురించి సరైన అవగాహన ఉండి, కంపెనీ త్రైమాసిక లాభాలు బాగుండటంతో పాటు కంపెనీ పనితీరు గురించి తెలిసి ఉండాలి. ఇతరుల మాటలను, నివేదికలను నమ్మి ఎప్పుడూ పెట్టుబడులు పెట్టకూడదు. అలా పెడితే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
స్టాక్ మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చేవాళ్లు స్టాక్స్ ను అమ్మడంపై కూడా పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. షేరు ధరను గమనిస్తూ అత్యాశకు పోకుండా సరైన సమయంలో అమ్మడం ద్వారా లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అర్థం చేసుకుని ఇతర అంశాలపై కొద్దిగా అవగాహన ఉంటే సులభంగా లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.