ఆస్ట్రేలియా సీరీస్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించకపోతే అతడి కెప్టెన్సీ వదుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్ 2020లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న ఆర్సీబీ ప్లేఆఫ్స్ నుంచే నిష్క్రమించడం.. రోహిత్ సారథ్యం లోని ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలవడం తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ఇది ఐదోసారి.. మరోవైపు కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ ఇంతవరకు ట్రోఫీ గెలవలేదు. అంతేగాక గత ఐపీఎల్లో విరాట్ పెద్దగా రాణించ లేదు.
Also Read: ఈసారి ఐపీఎల్ ఆదాయం 4 వేల కోట్లు…
రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఉత్తమ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలపాడు. కెప్టెన్సీ భారాన్ని మోస్తునే బ్యాటింగ్ లో నిలకడగా రాణించాడు. ఇదే రోహిత్ కు ప్లస్ పాయింట్ అవుతోంది. ఆస్ట్రేలియా టూర్ కి టీంఇండియా ఎంపికపై కూడా గంభీర్ విమర్శలు గుప్పించాడు.
నటరాజన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్ల ఎంపిక సరైంది కాదన్నాడు. టీం ఇండియా జట్టు ఎంపికకు ఐపీఎల్ ఆటతీరే ప్రామాణికమని కొందరు మాట్లాడుతున్నారు. అటువంటప్పుడు కెప్టెన్సీ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా అని పేర్కొ న్నారు. అయితే కెప్టెన్సీపై ఇప్పటికే కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఏ జట్టుకైనా ఒక్కరే కెప్టెన్ ఉండాలి అని చెప్పాడు.
రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న పార్థివ్ పటేల్ కూడా రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని కోరుతున్నాడు. తన సొంత కెప్టెన్ ను కాదని రోహిత్ కే ఓటు వేయడం ఆసక్తి రేపుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో రోహిత్ ఒత్తిడికి లోనుకాకుండా సరైన నిర్ణయాలను తీసుకోవడంలో దిట్ట. కోహ్లి మాత్రం అసహనాన్ని, ఆవేశాన్ని దాచుకోలేడని అంటున్నాడు.
Also Read: ఆస్ట్రేలియా సిరీస్: రోహిత్ ను భర్తీ చేసేదెవరు?
ఇలాంటి వాదనాలతో కోహ్లి ఆత్మస్థైరం దెబ్బతినే అవకాశం ఉంది. కెప్టెన్సీ మార్పు వార్తలు బలంగా వినిపిస్తోన్న ఈ పరిస్థితుల్లో కఠినమైన ఆస్ట్రేలియా సీరీస్ విరాట్ కు అగ్రిపరీక్షే. ఈ సీరీస్ లో కోహ్లీ వ్యక్తిగతంగా రాణించడంతో పాటు , కెప్టెన్ గా రాణించాలి. లేకపోతే విరాట్ కెప్టెన్సీ ఊడినట్లే.