దిగ్గజ సంస్థలలో ఒకటైన గూగుల్ సంస్థ నిరుద్యోగులకు, విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇంటర్న్ షిప్ చేయాలనుకునే నిరుద్యోగుల, విద్యార్థుల నుంచి గూగుల్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే ఏడాది సమ్మర్ లో ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.24,000తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!
ఎంపికైన నిరుద్యోగులు, విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. https://careers.google.com/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు, నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో ఇంటర్న్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా డిసెంబర్ 11, 2020 దరఖాస్తు చేయడానికి చివరి రోజుగా ఉంది.
Also Read: జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారా.. చేయకూడని తప్పులివే..?
ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వాళ్లు మూడు నెలల నుంచి మూడున్నర నెలలు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ క్యాంపస్ లలో ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వాళ్లు ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్ ను డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లను నేర్చుకున్న ఐటీ, ఐఎస్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు మాత్రమే ఇంటర్న్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం
ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు వెబ్ సైట్ లో ఇంటర్న్ షిప్ ఆప్షన్ ను ఎంచుకుని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్హులు జీ-మెయిల్ తో లాగిన్ అయిన తరువాత రెజ్యూమ్ అప్ లోడ్ చేసి విద్యార్హతల వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.