Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 24న ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. శనివారం చంద్రుడు సింహా రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారికి ఈరోజు అదృష్టం వరిస్తుంది. అనుకున్నపనులు సక్సెస్ అవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు ఆకస్మికంగా ఇంట్లోకి వస్తుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి.
వృషభ రాశి:
వ్యాపారస్తులకు ప్రతికూల వాతావరణం. దీంతో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. తెలివితేటలతో కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు.
మిధునం:
ఈ రాశివారు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశం. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్లాన్ అమలు చేస్తారు. కొన్ని పనుల్లో నిరాశ ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి.
సింహ:
ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపుతారు. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మొద్దు. ఇతరుల వద్ద తీసుకున్న డబ్బును సకాలంలో చెల్లిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
కన్య:
ఉద్యోగులకు అనుకూల వాతావరణం. సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఆన్ లైన్ వర్క్ చేసే వారికి ఆదాయం బాగుంటుంది.
తుల:
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని పనుల కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చే విషయంలో కాస్త ఆలోచించడం మంచిది.
వృశ్చికం:
వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మనసులో ఉన్న సమస్యల గురించి ఇతరులతో పంచుకుంటారు. పిల్లలకు కొన్నిబాధ్యతలు అప్పగిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ధనస్సు:
కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతి పెరిగే అవకాశం. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ గురించి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు.
మకర:
జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారాలనుకువారికి మంచి సమయం. వ్యాపారులు కొన్నిసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుంభం:
కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. కొత్త వ్యక్తుల నుంచిఅవకాశాలు పొందుతారు. వ్యాపారుల పెట్టుబడులకు మంచి సమయం. ఆదాయం బాగుంటుంది.
మీనం:
ఆస్తి తగాదాలు ఉండే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది.