Relationship Facts: ప్రేమలో ఉన్నప్పుడు యువతీ యువకులు చేయీ చేయీ పట్టుకుని చాలా దూరం వెళ్తారు. విరహాన్ని తట్టుకోలేక ముద్దులు పెట్టుకుంటారు. పరస్పరం కౌగిలించుకుంటారు. దీనిని మానసిక శాస్త్ర పరిభాష ప్రకారం శారీరక సాన్నిత్యం అంటారు. వీటికి అవధులు లేకపోయినప్పటికీ.. కొంత పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ప్రేమను బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయి. ప్రముఖ రచయిత ” గ్యారీ చాప్ మన్” ” 5 లవ్ లాంగ్వేజెస్” ఆమె పుస్తకాన్ని రాశారు. అందులో వాగ్దానాలు, సాన్నిహిత్య సమయం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, వ్యక్తిగతంగా చూపించే శ్రద్ధ, శారీరక సౌఖ్యం, ప్రేమలో సాన్నిత్యం వంటి విషయాలను రచయిత అత్యంత స్పష్టంగా వివరించారు.
ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత శారీరక సాహిత్యాన్ని కచ్చితంగా కలిగి ఉండాలి. అది శరీరంతో పాటు, మనసును ఉత్తేజంగా ఉంచుతుంది. భౌతిక పరమైన కలయిక వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిటోసిన్ శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అది మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.. శారీరక సాన్నిహిత్య సమయంలో మెదడు నుంచి డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.
భాగస్వామితో కచ్చితంగా మానసిక సాన్నిహిత్యం కలిగి ఉండాలి. ఇద్దరి మధ్య ఎన్ని సంఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ మానసిక సాన్నిహిత్యాన్ని దూరం పెట్టకూడదు. దాంతోపాటు శారీరక సాన్నిహిత్యాన్ని మరవకూడదు. ఇది ఆందోళన, భయం, నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదాహరణకు మీ భాగస్వామి ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి నుదుటిపై ఒక చిన్న ముద్దు పెట్టండి. అలా చేయడం వల్ల వారు దాని నుంచి ఉపశమనం పొందుతారు.
ముద్దు పెట్టుకోవడం, ఊరడించడం, శారీరకంగా తాకడం వంటివి మనసులోని భావాలను వెల్లడిస్తాయి. అలాంటి క్షణాల్లో భావాల వ్యక్తీకరణకు ఇటువంటి పదాలు అవసరం లేదు. అలాంటి సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అస్థిరత, తీవ్రమైన బాధ అనేవి దూరమవుతాయి. శారీరక సాన్నిహిత్యం ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పంచుతుంది. ఇలాంటి సమయంలో ఖర్చయ్యే కేలరీలు శరీరానికి ఒక ఆకృతిని తీసుకొస్తాయి. ఫ్యాట్ కరిగిపోవడం వల్ల జీవక్రియలు మరింత మెరుగవుతాయి.
(ఈ కథనం వివిధ మార్గాల ద్వారా మేము సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించాం.. తదుపరివాటికి మేము ఎటువంటి బాధ్యత వహించం)