HomeNewsHIV-positive: ఎయిడ్స్‌ ఉందని తెలిసి 200 మందితో శృంగారం.. ఈమె చేసిన దారునం!

HIV-positive: ఎయిడ్స్‌ ఉందని తెలిసి 200 మందితో శృంగారం.. ఈమె చేసిన దారునం!

HIV-positive: హెచ్‌ఐవీ.. ప్రపంచంలో ఇప్పటి వరకు మందులేని రోగం ఇదే. సురక్షితం కాని శృంగారం, రక్తం మార్పిడి ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా అమెరికాలో ఓ సెక్స్‌ వర్కర్‌ వందల మందికి వైరస్‌ను అంటగట్టింది. అనేక మందితో శృంగారంలో పాల్గొంది. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో అధికారుల అప్రమత్తమయ్యారు. అందరినీ అలర్ట్‌ చేశారు. ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నవారు వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఆ సెక్స్‌ వర్కర్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.

ఒహైయో రాష్ట్రంలో వెలుగులోకి..
అమెరికాలోని ఒహైయో రాష్ట్రగంలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే ఓ సెక్స్‌ వర్కర్‌. అక్కడి మార్కెట్‌ వీధిలో అనేక మందిని ఆమె ఆకర్షిస్తుంది. ఇలా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు అనేక మందితో లైంగిక సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ వర్చింది.

అయినా సెక్స్‌…
తనకు హెచ్‌ఐవీ ఉందని తెలిసిన తర్వాత కూడా లిండా తన శృంగార కార్యకలాపాలు కొనసాగించింది. రెండున్నరేళ్లలో 211 మందితో శృంగారంలో పాల్గొంది. ఆలస్యంగా విషయం తెలియడంతో అధికారులు హెల్త్‌ అలర్ట్‌ ప్రకటించారు. లిండాతో సన్నిహితంగా మెలిగినవారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్థానికులతోపాటు పొరుగు రాష్ట్రం ప్రజలకు కూడా తెలియజేశారు. వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ ఆమెతో శృంగారం చేసినవారు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఎందుకలా చేసిందో..
అయితే లిండా తనకు హెచ్‌ఐవీ ఉందని తెలిసి కూడా శృంగారంలో పాల్గొనడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె డబ్బుల కోసం అలా చేసిందా లేక తన జబ్బు అందరికీ అంటించాలన్న లక్ష్యంతో ఇలా చేసిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తనకు వైరస్‌ సోనిన విషయం తెలిసి సైకోలా మారి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి తన జీవితం ముగిసిందని తెలిసి కూడా లిండా.. మరో 211 మంది జీవితాలకు ముగింపు పలకాలని చూడడమే దారుణం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version