Homeఎంటర్టైన్మెంట్Janhvi Kapoor : ఇలాంటి ప్రవర్తన ఎవరైనా అనుమతిస్తారా? పెద్ది హీరోయిన్ జాన్వీ సీరియస్

Janhvi Kapoor : ఇలాంటి ప్రవర్తన ఎవరైనా అనుమతిస్తారా? పెద్ది హీరోయిన్ జాన్వీ సీరియస్

Janhvi Kapoor : జాన్వీ కపూర్ స్టార్ లేడీ. ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో జాన్వీ కపూర్ సామాజిక సమస్యల మీద స్పందించారు. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను తీస్తున్న వారిపై ఆమె మంది పాడిపడ్డారు. తాజాగా జైపూర్ లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఓ మహిళ వేగంగా కారు నడిపి, ఓ బైక్ ని వెనక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదం జాన్వీ కపూర్ దృష్టికి వెళ్ళింది. దాంతో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

”ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన ఎవరైనా అనుమతిస్తారా? మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా చుట్టూ ఉన్నవారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేయడం సరైనదే అని ఎవరైనా అనుకుంటారా? ఈ ప్రమాదం గురించి తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యాను. మద్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది గాయాలపాలు అవుతున్నారు. చట్టాలను మనం ఎందుకు పాటించడం లేదు. కనీస అవగాహన లేకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం” అని జాన్వీ కపూర్ కామెంట్ చేసింది. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్ట విరుద్ధం. అది ప్రాణాంతకం అని జాన్వీ కపూర్ తెలియజేసింది.

Also Read : ”అందుకు కరెక్ట్ గా సరిపోతుంది”.. జాన్వీ కపూర్ పై కండోమ్ కంపెనీ అధినేత షాకింగ్ కామెంట్స్!

చట్టాలు పాటించాలని హితవు పలికిన జాన్వీ కపూర్ సామాజిక బాధ్యతను కొనియాడుతున్నారు. కాగా దేవర మూవీతో జాన్వీ కపూర్ సౌత్ లో అడుగుపెట్టింది. దేవర మంచి విజయం అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. జాన్వీ కి సౌత్ లో మంచి ఆరంభం లభించింది. దేవర 2 సైతం తెరకెక్కించాల్సి ఉంది. జాన్వీ ఖాతాలో దేవర 2 సైతం ఉంది.

దేవర విడుదలకు ముందే రామ్ చరణ్ మూవీకి జాన్వీ కపూర్ సైన్ చేసింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు పెద్ది టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ రోల్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. పెద్ది చిత్రం పై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : ఆ గుడిలో పెళ్లి, బాంబు పేల్చిన దేవర బ్యూటీ జాన్వీ కపూర్!

RELATED ARTICLES

Most Popular