Canada elections : కెనడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 4వ సారి లిబరల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవానికి అందరూ ఊహించినదానికి భిన్నంగా జరిగింది. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉండగా భారత్ కు బద్ద వ్యతిరేకి. ఖలిస్తానీలతో కలిసి భారత్ పై విషయం చిమ్మాడు. ఈ విధానాలతోనే ఫేడ్ అవుట్ అయిపోయి విఫల ప్రధానిగా దిగిపోయాడు.
ట్రూడో ఉన్నప్పుడే కన్జర్వేటివ్ పార్టీ 20శాతం ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోయింది. అయినా ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ గెలవడం ఎవ్వరూ ఊహించలేదు. దీనికి రెండే కారణాలు. ప్రధానమైనది.. జస్టిన్ ట్రూడోను లిబరల్ పార్టీ నుంచి పంపించి రాజీనామా చేయించారు. ఆర్థికవేత్త మార్క్ కార్నోను ప్రధాని రేసులో నిలిపారు. రెండోది ట్రంప్ ఎఫెక్ట్ తో కేనడా ప్రజల్లో ఒకరకమైన సానుభూతి లిబరల్ పార్టీ వైపు మరళేలా చేసింది.
అప్రతిష్టపాలయ్యాడో ట్రూడోను తీసేయడం లిబరల్ పార్టీకి కలిసి వచ్చింది. ట్రంప్ మాటలు కెనడా ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది. సర్వేలు కూడా లిబరల్ పార్టీ వైపే మొగ్గాయి. అయినా పూర్తి మెజార్టీ లిబరల్ పార్టీకి రాలేదు.
ఒకటి ట్రంప్ ప్రకటనతో మల్టిపార్టీ సిస్టం ఉన్న ప్రజల్లో అందరూ ఒక్కటై కన్జర్వేటివ్ పార్టీ కాని వారందరూ లిబరల్ పార్టీ వైపు మొగ్గు చూపడం ఆ పార్టీ గెలుపునకు సహకరించింది.
కెనడా ఎన్నికల్లో గణనీయంగా భారతీయ సంతతి వారు ఎన్నిక.. కెనడా ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.