https://oktelugu.com/

Health Benefits: ఖాళీ కడుపుతో ఈ ఆయిల్ తాగితే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట!

శరీర, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్‌ ఆయిల్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిదని నిపుణలు చెబుతున్నారు. ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ ఆలివ్‌ ఆయిల్‌ను ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మరి ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2024 / 03:29 AM IST

    Olive Oil

    Follow us on

    Health Benefits: ఖాళీ కడుపుతో వేడి నీరు, నిమ్మరసం వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పూర్వకాలంలో కొన్ని రకాల ఆయిల్స్‌ను డైరెక్ట్‌గా తాగేవారు. కానీ రోజుల్లో అసలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ తినడం, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటివి చేస్తున్నారు. వీటివల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది ఆరోగ్యం కంటే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వ్యక్తిగత కారణాలు, వర్క్ లైఫ్ వల్ల చాలా ఆహార విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. అయితే శరీర, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్‌ ఆయిల్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిదని నిపుణలు చెబుతున్నారు. ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ ఆలివ్‌ ఆయిల్‌ను ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మరి ఈ స్టోరీలో చూద్దాం.

    మారుతున్న జీవనశైలి వల్ల అధిక శాతం మంది జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి బారిన పడుతున్నారు. వీటిన్నింటి నుంచి విముక్తి చెందాలంటే ఆలివ్ ఆయిల్‌ను ఖాళీ కడుపుతో తాగాల్సిందే. ఖాళీ కడుపుతో ఆలివ్ ఆయిల్‌ని తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆలివ్ ఆయిల్‌లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో మలవిసర్జన సులభంగా అవుతుంది. అలాగే ఖాళీ కడుపుతో ఆలివ్ ఆయిల్ తాగడం వల్ల ప్రేగు కదలికలు సులభతరం అవుతాయి. దీంతో మలవిసర్జన చేసేటప్పుడు ఒత్తిడి ఉండదు. ఖాళీ కడుపుతో ఆలివ్ నూనె తాగడం వల్ల పిత్త ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ప్రేగులలో దీర్ఘకాలిక మంటతో ఇబ్బంది పడేవారికి కూడా ఆలివ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఆలివ్ నూనెలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పేగులో మంటను తగ్గిస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

    ఆలివ్ ఆయిల్ మంచిదని ఎక్కువగా తీసుకోవద్దు. కేవలం టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. డైరెక్ట్‌గా తాగలేని వారు.. కావాలంటే నిమ్మరసంతో కలిపి ఆలివ్ ఆయిల్ తాగవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో తేలిక పాటి ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే సలాడ్లు, వంటల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. వీటితో పాటు నెయ్యితో కలిపి కూడా ఆలివ్ ఆయిల్ తీసుకున్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ కేవలం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని అందంగా తీర్చుదిద్దుతాయి. ముఖ్యంగా చలికాలంలో ఆలివ్ ఆయిల్‌తో చర్మాన్ని మసాజ్ చేస్తే అందంగా ఉంటుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.