Homeవార్త విశ్లేషణHow Intestines Is Second Brain:మనిషి ప్రేగుల్లో రెండవ మెదడు ఉందా.. అయితే అది ఎలా...

How Intestines Is Second Brain:మనిషి ప్రేగుల్లో రెండవ మెదడు ఉందా.. అయితే అది ఎలా పని చేస్తుంది?

How Intestines Is Second Brain:మనకు ఎప్పుడైనా చాలా భయం లేదా ఆందోళన అనిపించినప్పుడు, ఆ ప్రభావం కడుపుపై కనిపిస్తుంది. అంటే కడుపు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. కొందరికి కడుపులో వాంతులు, సీతాకోకచిలుకలు ఎగిరినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మన భావోద్వేగాలు మన ప్రేగులకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. మనకు కోపం, ఆందోళన, విచారం వంటి భావోద్వేగాలు ఉన్నప్పుడు, అవి కడుపుపై ప్రభావం చూపుతాయి. అంటే మెదడు ప్రభావం నేరుగా పొట్ట పేగులపైన చూపుతుంది.. అందుకే ఆరోగ్యనిపుణులు పొట్టని సెకండ్ బ్రెయిన్ అని అభివర్ణిస్తుంటారు.

మన పొట్టను నియంత్రించే నాడీ వ్యవస్థను ఎంటరిక్ నెర్వస్ సిస్టమ్ అంటారు. ఇది మన పొట్టలోని జీర్ణవ్యవస్థకు సంబంధించిన భాగాలకు లైనింగ్ లాగా ఏర్పడుతుంది. ఇది అన్నవాహిక నుండి కిందభాగం రెక్టమ్ వరకు ఉంటుంది. మన మెదడులో ఉండే నాడీ కణాల్లాంటివే ఈ ఎంటరిక్ నెర్వస్ సిస్టమ్ లో కూడా ఉంటాయి. ఈ నాడీ కణాలు నరాల వ్యవస్థ ద్వారా మెదడుకి అనుసంధానమై ఉంటాయి. అందుకే పొట్ట మెదడు పరస్పర అనుసంధానంతో పనిచేస్తాయి. అంటే పొట్టలో ఆహారం జీర్ణం అవడానికి, భయం కలిగితే మెదడు అప్రమత్తం అవడానికి ఉపయోగపడుతున్న రసాయనాలు, నాడీకణాలు ఒకే రకమైనవి అన్నమాట. దీనిని శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన అంశంగా పరిగణిస్తున్నారు.

మీకు నచ్చిన ఆహారం గురించి ఆలోచించినప్పుడు, ఆహారం తినబోతున్నప్పుడు.. ఆహారం చూడకుండానే మెదడులోని ఊహాశక్తి వల్ల కడుపులో జీర్ణరసాలు స్రవిస్తాయి. మెదడు , కడుపు మధ్య కనెక్షన్ రెండు వైపుల నుండి నడుస్తుంది. పొట్ట బాగా లేకుంటే తాలూకు సంకేతాలు మెదడుకు వెళ్లి మెదడులో సమస్య ఉంటే ఆ ప్రేరణలు కడుపుపై ప్రభావం చూపుతాయి. దీన్ని బట్టి మన పొట్టలోని పేగులు ఒత్తిడికి గురైతే అది ఆందోళన, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ గా మారే అవకాశం ఉంది. ఏదైనా ఒత్తిడితో కూడిన లేదా భయపెట్టే పని చేసే ముందు కడుపులో నొప్పిగా అనిపించడం. మన మానసిక స్థితి మన కడుపుపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుందని చాలా ఆధారాలు ఉన్నాయి. మనం ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు, మన జీర్ణవ్యవస్థలో కదలికలు, సంకోచాలలో తేడా ఉంటుంది. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు మెదడుపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలతో బాధపడేవారిలో ఏవైనా పొత్తికడుపు నొప్పులు తీవ్రంగా ఉంటాయి. కడుపు నుండి వచ్చే నొప్పి సంకేతాలకు వారి మెదళ్ళు ఎక్కువగా స్పందించడమే దీనికి కారణం. ఒత్తిడిలో ఉన్నవారికి సాధారణ నొప్పి కూడా తీవ్రంగా అనిపిస్తుంది.

దీని ఆధారంగా, జీర్ణవ్యవస్థ వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఆందోళన, నిరాశ, ఒత్తిడిని తగ్గించే చికిత్సలు బాగా పనిచేస్తాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వారికి కేవలం మందులే కాకుండా సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటివి మెదడుకు సంబంధించినవే కాకుండా పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని, గుండెల్లో మంట, కడుపునొప్పి, విరేచనాలు కూడా మానసికంగా ఉంటాయని అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మానసిక భయాందోళనలు, ఒత్తిళ్లు, కడుపు సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్న వారు ఈ అవగాహన కలిగి ఉంటే వారి సమస్యలను వైద్యులతో కూలంకషంగా చర్చించి తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అంటే మెదడు, పొట్ట సమస్యలను వేరు వేరు సమస్యలుగా పరిగణించినప్పుడు మరింత త్వరగా, సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version