Shah Jahan Wife
Shah Jahan Wife: సినిమాల్లో హీరో హీరోయిన్ ల మాదిరి తాజ్ మహల్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. భారతదేశంలో ఎన్ని పర్యాటక ప్రాంతాలున్నా ఈ తాజ్ మహల్ అందం, దాని ప్రత్యేకత సపరేటు. నిత్యం వేలాది మంది ఇక్కడికి వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులు, కపుల్స్ కు మంచి ప్లేస్ తాజ్ మహల్. భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా చక్రవర్తి షాజహాన్ దీన్ని నిర్మించారు. 1631 వ సంవత్సరంలో ఈయన చక్రవర్తిగా ఉన్న సమయంలో గొప్ప సంపదతో కూడి ఉండేది మొఘల్ సామ్రాజ్యం.
షాజహాన్ మూడో భార్యనే ముంతాజ్. ఈమె 14వ సంతానానికి అంటే గౌహర్ బేగానికి జన్మనిస్తూ మరణించింది. దీంతో షాజహాన్ చాలా విచారంగా ఉన్నారట. కొన ఊపిరితో ఉన్న ముంతాజ్ భర్తను ఓ కోరిక కోరిందట. అదేనండి ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని కనీవిని ఎరుగని సమాధిని తనకోసం కట్టించాలి అని కోరిందట. ఆ భార్య కోరిక మేరకు షాజహాన్ 1632 వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు.
వీరి ప్రేమకు చిహ్నంగా ఈ తాజ్ మహల్ ఎంత ప్రత్యేకతను సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వీరి టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా. అదేనండి ముంతాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. పైన చూశారుగా ఆమెనే షాజహాన్ భార్య ముంతాజ్. ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు వామ్మో ఈమె కోసమా అంత పెద్ద సమాధిని నిర్మించింది అంటూ విస్తుపోతున్నారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ముంతాజ్ వి కావట. మరి ఈ ఫోటోలో ఉన్నది మామూలు మహిళలు ఏం కాదట. ఈ ఫోటోలో ఉన్న మహిళల పేర్తు సుల్తాన్ షాజహాన్ బేగం, బేగం సుల్తాన్ జహాన్. వీరు భోపాల్ నగరాన్నే పాలించిన మూడవ నాల్గవ బేగాలు అని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫోటోలకు ముంతాజ్ కు ఎలాంటి సంబంధం లేదు.