https://oktelugu.com/

Supritha: స్కూల్ ఏజ్ లోనే ఆ పాడు పని, అమ్మ చితక్కొట్టింది… సురేఖావాణి కూతురు సుప్రీత ఓపెన్ కామెంట్స్!

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దావత్ అనే టాక్ షోలో అమర్ దీప్, సుప్రీత పాల్గొన్నారు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి దావత్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తన గెస్ట్ లని బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ రీతూ రచ్చ చేస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 28, 2024 / 09:12 AM IST

    Supritha

    Follow us on

    Supritha: నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరో. కాగా ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దావత్ అనే టాక్ షోలో అమర్ దీప్, సుప్రీత పాల్గొన్నారు. జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి దావత్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తన గెస్ట్ లని బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ రీతూ రచ్చ చేస్తుంది. ఇలాంటి ప్రశ్నలే అమర్ దీప్, సుప్రీతను కూడా అడిగింది రీతూ చౌదరి.

    ఈ క్రమంలో మీ లైఫ్ లో కిక్ కోసం , క్రాక్ తో , బలుపు తో చేసే పనులు కొన్ని ఉంటాయి. మీరు చేసిన ఆ పనులు ఏమిటో చెప్పాలని రీతూ చౌదరి అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానంగా సుప్రీత… తాను లైసెన్స్ లేకుండా కారు నడిపే దాన్ని అని చెప్పింది. మా అమ్మ పడుకున్నప్పుడు కారు కారు తీసుకుని వెళ్లేదాన్ని. అప్పుడు నాకు 15 – 16 ఏళ్ళు ఉంటాయి. ఒకసారి దొరికిపోయా అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టింది అని సుప్రీత తెలిపింది.

    ఇక పక్కనే ఉన్న అమర్ దీప్ ఫ్రెండ్స్ తో మందు కొట్టి సీసాలు దొరక్కుండా దాచేవాళ్ళం అని అన్నాడు. దీంతో సుప్రీత చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో మందు కొట్టిన విషయం బయట పెట్టింది. టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నా తీట పని ఏంటంటే .. మా అమ్మకి తెలియకుండా మందు బాటిల్ తీసుకెళ్లి .. స్కూల్ లో నా ఫ్రెండ్స్ అందరికి స్ప్రైట్ లో కలిపి తాగిపించేశా. ఆ తర్వాత మా కోఆర్డినేటర్ కి దొరికిపోయాం అని సుప్రీత చెప్పింది.

    ఇక క్రాక్ తో చేసిన పని ఏంటని రీతూ అడిగింది. దీంతో సుప్రీత .. తాను ఇష్ట పడే వాడిని వేరే వాళ్ళు చూస్తే వెళ్లి వాళ్ళని తన్నే దాన్ని అని చెప్పింది. ఓ అమ్మాయి .. ఆ అబ్బాయిని చూస్తుందని కొట్టిన రోజులు ఉన్నాయి. మేమిద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నపుడు మధ్యలో ఎవరైనా వస్తే కచ్చితంగా కొడతాను. నాతో ఫ్రెండ్ షిప్ ఉన్నవాడు .. వేరే కొత్త అమ్మాయి కోసం నన్ను బ్లాక్ చేస్తే .. వేరే వేరే నంబర్ల నుండి కాల్ చేసి టార్చర్ చేసేదాన్ని. నన్నే బ్లాక్ చేస్తాడా అని బలుపు చూపించేదాన్ని అంటూ సుప్రీత చేసిన కొన్ని క్రేజీ థింగ్స్ చెప్పుకొచ్చింది.