https://oktelugu.com/

Meena: హీరో ధనుష్ తో మీనా రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన మీనా

పుకార్లను నమ్మవద్దని.. కావాలనే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ మీన చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా ఈ పుకార్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ సారి మరింత డోస్ పెంచుతూ ఏకంగా ధనుష్ తో రెండో పెళ్లి అంటూ మరో పుకారు సోషల్ మీడియాలో రాజ్యమేలుతోంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 28, 2024 / 09:03 AM IST

    Meena

    Follow us on

    Meena: సోషల్ మీడియాలో ఎవరి గురించి ఎలాంటి వార్తలు వస్తాయో ఊహించడం కూడా కష్టమే. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు కొందరు కష్టాల్లో ఉన్న వారి మీద కూడా ఇష్టానుసారం వార్తలు రాస్తూ సంపాదిస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని నటి మీనా కూడా ఎదుర్కొంది. ఆమె భర్త రీసెంట్ గా చనిపోయిన సంగతి తెలిసిందే. సందు దొరికిందే అదును అన్నట్టుగా.. మీన భర్త చనిపోవడంతో ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది అని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి.

    పుకార్లను నమ్మవద్దని.. కావాలనే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ మీన చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా ఈ పుకార్లకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ సారి మరింత డోస్ పెంచుతూ ఏకంగా ధనుష్ తో రెండో పెళ్లి అంటూ మరో పుకారు సోషల్ మీడియాలో రాజ్యమేలుతోంది. దీంతో ఆవేదన చెందిన మీన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఈమె ఏమందంటే..

    నెట్టింట మీనాపై దాడి జరగడం మాత్రమే కాదు హీరో ధనుష్ తో రెండో పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. నిజనిజాలు ఏంటో తెలుసుకొని రాయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మీనా. నిజాలు తెలుసుకొని రాయడమే అందరికీ మంచిది. నాలాగా ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు.

    అందరికీ పిల్లలు, కుటుంబం ఉంటుంది. కొంచెం వారి గురించి కూడా ఆలోచించండి. నాకు పేరెంట్స్, కూతురు ఉంది వారి గురించి ఆలోచించకుండా ఇలా రాస్తారా అంటూ మండిపడింది మీనా. ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో తెలియదు. ఆ ఉద్దేశం ఉంటే నేను మీకు చెబుతాను. అప్పటి వరకు పుకార్లను ఆపేయండి అంటూ తెలిపింది మీనా. మరి ఇప్పుడు అయినా ఆమె బాధను అర్థం చేసుకొని ఇలాంటి పుకార్లు ఆపేస్తారో లేదో చూడాలి.