https://oktelugu.com/

Indian Railways: రైళ్లలో దూర ప్రయాణం చేసేవాళ్లకు అదిరిపోయే శుభవార్త!

Indian Railways: భారతీయ రైల్వే రైలు ప్రయాణికులకు తీపి కబురు అందించింది. రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా రైల్వే శాఖ కొత్తకొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. రైల్వే శాఖ రైలు ప్రయాణికుల కోసం డిస్పోజబుల్‌ బెడ్‌రోల్‌ కిట్‌ లను అందిస్తుండటం గమనార్హం. రైల్వే శాఖ మొదట ఎంపిక చేసిన రైళ్లలో ఈ సర్వీసులను అందించడానికి సిద్ధమైంది. కరోనా మహమ్మారికి ముందు రైల్వే శాఖ దుప్పట్లు, దిండ్లను ప్రయాణికులకు అందించేది. అయితే కరోనా కేసులు భారీస్థాయిలో నమోదైన తర్వాత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2021 / 05:42 PM IST
    Follow us on

    Indian Railways: భారతీయ రైల్వే రైలు ప్రయాణికులకు తీపి కబురు అందించింది. రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా రైల్వే శాఖ కొత్తకొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. రైల్వే శాఖ రైలు ప్రయాణికుల కోసం డిస్పోజబుల్‌ బెడ్‌రోల్‌ కిట్‌ లను అందిస్తుండటం గమనార్హం. రైల్వే శాఖ మొదట ఎంపిక చేసిన రైళ్లలో ఈ సర్వీసులను అందించడానికి సిద్ధమైంది. కరోనా మహమ్మారికి ముందు రైల్వే శాఖ దుప్పట్లు, దిండ్లను ప్రయాణికులకు అందించేది.

    అయితే కరోనా కేసులు భారీస్థాయిలో నమోదైన తర్వాత రైల్వే శాఖ ఈ సేవలను నిలిపివేసింది. రైలు ప్రయాణికులు డిస్పోజబుల్‌ బెడ్‌రోల్‌ కిట్‌ ల కోసం 300 రూపాయలు చెల్లించాలి. జోన్లను బట్టి చెల్లించే మొత్తంలో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ఈ కిట్ లో భాగంగా ఎయిర్ పిల్లో, పిల్లో కవర్, ఫేస్ టవల్ లేదా న్యాప్‌కిన్, మూడు ఫేస్ మాస్కులు, 48 x 75 అంగుళాల బెడ్ షీట్, 54 x 78 అంగుళాల బ్లాంకెట్ ఉంటాయి.

    కొన్ని జోన్స్ లో వీటితో పాటు టూత్ పేస్ట్, శానిటైజర్ కూడా లభిస్తాయి. మూడు రకాల డిస్పోజబుల్‌ బెడ్‌రోల్‌కిట్‌లు అందుబాటులో ఉంటాయి. కిట్ లో టూత్‌పేస్ట్‌, బ్రష్‌, హెయిర్‌ ఆయిల్‌, దువ్వెన, శానిటైజర్‌, సబ్బు, టిష్యూ పేపర్లు కూడా లభిస్తాయి. ఒక వ్యక్తి 150 రూపాయలు మాత్రమే చెల్లిస్తే దుప్పటిని మాత్రమే పొందవచ్చు. ముంబై-ఢిల్లీ ఆగస్ట్‌ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌, గోల్డెన్‌ టెంపుల్‌ మెయిల్‌, పశ్చిమ ఎక్స్‌ప్రెస్‌, మరికొన్ని రైళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

    దూర ప్రాంతాలకు రైలు ప్రయాణం చేసేవాళ్లకు ఈ సేవల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మాత్రమే రైల్వే శాఖ ఈ సేవలను అందించనుంది.