Prabhas: సిగ్గా.. దగ్గా.. ఏంటి డార్లింగ్ ఇది!

Prabhas: ఈ రోజుల్లో హీరో అంటే సవాలక్ష లక్షణాలు ఉండాలి. మంచి నటుడైతే సరిపోదు. దానికి మించి గొప్ప వక్త కూడా కావాలి. ఫ్యాన్స్, ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యేలా మాట్లాడడం ఓ కళ. అది అతి కొద్ది మంది హీరోలు మాత్రమే కలిగి ఉంటారు. సదరు హీరోలు మైక్ పట్టుకుంటే మాటలు జలపాతంలా దొర్లిపోతూ ఉంటాయి. ఎప్పుడో కానీ ఓ పబ్లిక్ వేదికపై స్టార్ హీరోలు మాట్లాడరు. అరుదుగా వచ్చే ఈ అవకాశం కోసం ఫ్యాన్స్ ఎంతో […]

Written By: Shiva, Updated On : December 24, 2021 6:18 pm
Follow us on

Prabhas: ఈ రోజుల్లో హీరో అంటే సవాలక్ష లక్షణాలు ఉండాలి. మంచి నటుడైతే సరిపోదు. దానికి మించి గొప్ప వక్త కూడా కావాలి. ఫ్యాన్స్, ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యేలా మాట్లాడడం ఓ కళ. అది అతి కొద్ది మంది హీరోలు మాత్రమే కలిగి ఉంటారు. సదరు హీరోలు మైక్ పట్టుకుంటే మాటలు జలపాతంలా దొర్లిపోతూ ఉంటాయి. ఎప్పుడో కానీ ఓ పబ్లిక్ వేదికపై స్టార్ హీరోలు మాట్లాడరు. అరుదుగా వచ్చే ఈ అవకాశం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన మాటలు వింటూ మైమరచిపోవాలని, ఎలివేషన్స్ కి చొక్కాలు చించుకోవాలని కోరుకుంటారు.

Prabhas

ఓ స్టార్ హీరో ఈవెంట్ కి నాలుగైదు గంటల ముందే స్టేజ్ దగ్గరకొచ్చి ఫ్యాన్స్ పడిగాపులు పడుతూ ఉంటారు. సదరు స్టార్ హీరో మాత్రం ఈవెంట్ మొదలైన ఓ మూడు గంటల తర్వాత ఆర్చుకొని తీర్చుకొని వస్తాడు. ఫ్యాన్స్ ఇన్ని గంటలు ఎదురు చూసేది ఆ హీరో స్పీచ్ కోసమే. మరి అలాంటి స్పీచ్ మూడు నిమిషాల్లో ముగిస్తే ఫ్యాన్స్ త్యాగానికి అర్థం ఉంటుందా..?

Also Read: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?

నిన్న రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ అదే చేశారు. దేశం నలుమూలల నుండి మీడియా, ఫ్యాన్స్ హైదరాబాద్ చేరుకున్నారు. రాధే శ్యామ్ ఈవెంట్ ని ప్రత్యేకంగా కవర్ చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ మొదలైంది. ఏడు గంటలకు అతిథులు కూడా వచ్చేశారు. ప్రభాస్ రాత్రి 8:30 తర్వాత ఎంట్రీ ఇచ్చారు.

కాగా రాధే శ్యామ్ వేదికపై కనీసం ఐదు నిమిషాలు ప్రభాస్ మాట్లాడలేదు. తన స్పీచ్ లో కనీసం చిత్ర యూనిట్ మొత్తాన్ని కవర్ చేయలేదు. సగం మంది సాంకేతిక నిపుణుల పేర్లు మర్చిపోయారు. ఏదో చిన్న పిల్లాడి మాదిరి నాకు సిగ్గంటూ.. ఐ లవ్ యూ డార్లింగ్ అని ముగించాడు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫ్యాన్స్ ని ప్రభాస్ తీవ్ర నిరాశ పరిచారు. భవిష్యత్ లో అయినా ప్రభాస్ ఈ సమస్యను అధిగమిస్తే మంచిది.

Also Read: ఆయన ఓ చిన్నపాటి దేవుడిలా కనిపిస్తున్నారు కదా?- ప్రభాస్​

Tags