https://oktelugu.com/

Hero Sree Vishnu: విడుదలైన “అర్జున ఫల్గుణ ” ట్రైలర్…

Hero Sree Vishnu: బ్రోచేవారెవరురా,గాలి సంపత్, వంటి చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు.కొత్త దర్శకుడు తేజ మార్ని దర్శకత్వంలో హీరో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం “అర్జున ఫల్గుణ”.మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ డిసెంబర్ 31న ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. Also Read: సిగ్గా.. […]

Written By: , Updated On : December 24, 2021 / 05:32 PM IST
Follow us on

Hero Sree Vishnu: బ్రోచేవారెవరురా,గాలి సంపత్, వంటి చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు.కొత్త దర్శకుడు తేజ మార్ని దర్శకత్వంలో హీరో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం “అర్జున ఫల్గుణ”.మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ డిసెంబర్ 31న ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

Hero Sree Vishnu

Hero Sree Vishnu

Also Read: సిగ్గా.. దగ్గా.. ఏంటి డార్లింగ్ ఇది!

ఈ సందర్భంగా తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది’..అనే పాయింట్‌తో ఉత్కంఠగా తెరకెక్కించారు.దసరా సందర్భంగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ కూడా మంచి స్పందన లభిస్తోంది.అరకెళ్లి నా పేరు చెప్తే నీకో మూటిత్తాడు . ఇంకా ఈ సినిమా కథాంశం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి పట్నం వచ్చిన ఓ నలుగురు మిత్రులు అనుకోని రీతిలో ఓ సమస్యలో ఇరుక్కుంటారు. చివరికి హీరో, అతని స్నేహితులు ఆ సమస్య నుంచి ఎలా బైటపడ్డారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా అలరించబోతోంది.ఇటీవల విడుదలైన “రాజ రాజ చోర” తో శ్రీవిష్ణు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరిన విడుదల కాబోతున్న ‘అర్జున ఫల్గుణ’తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి మరి ఈ టాలెంటెడ్ హీరో.

Also Read: మరో ఆఫర్ అందుకున్న భీమ్లానాయక్ హీరోయిన్……