Gannavaram Ex.MLA Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Vamsi Mohan) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల కిందటే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 135 రోజులపాటు ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలోనే పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. జైలు నుంచి ఆసుపత్రులకు తీసుకొచ్చి చికిత్స అందించేవారు. ఇప్పుడు బెయిల్ పై వచ్చిన ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read: ఇడుపాలపాయలో తండ్రికి జగన్, షర్మిల ఘన నివాళి.. అభిమానులకు నిరాశ!
135 రోజులపాటు జైల్లో..
ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఏపీ పోలీసులు హైదరాబాదులో( Hyderabad) ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 11 కేసులు నమోదు చేశారు. అనేకసార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యేవి. ఎట్టకేలకు ఈనెల 2న ఆయనకు బెయిల్ లభించింది. దీంతో ఆయన బయటకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆ మరుసటి రోజున భార్యతో కలిసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అటు తరువాత మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వల్లభనేని వంశీని పరామర్శించారు. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు.
నట రత్నాలు, నట శేఖర లు ఎక్కడో వుండరు,
మన చుట్టూ గన్నవరం గాండు, గుడివాడ గుట్కా రూపాల్లో తిరుగుతూ వుంటారు..
వాడు ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ,
వీడియోలు తీసి సోషల్ మీడియా లో పెట్టి డ్రామా లు ఎందుకు…??#VallabhaneniVamsi pic.twitter.com/CBwrq9fevk— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) July 7, 2025
వైసిపి హయాంలో దూకుడు..
వల్లభనేని వంశీ మోహన్ దూకుడుగా వ్యవహరించారు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఈ ఎన్నికల్లో గన్నవరం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన విదేశాలకు వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. ఇంతలోనే పాత కేసులను తిరగదోడుతూ ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా చేశారు. దాదాపు 135 రోజులపాటు వంశీ జైల్లోనే గడపాల్సి వచ్చింది. వాస్తవానికి గతంలో కూడా వల్లభనేని వంశీ మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే జైల్లోకి వెళ్లిన తరువాత అనారోగ్యం మరింత తీవ్రమైంది. ఇప్పుడు బయటకు వచ్చినా ఆ ప్రభావం ఇంకా కనిపిస్తోంది.
Take some time #vallabanenivamsi Anna and then come with the superpower pic.twitter.com/luvP9oAdsk
— Chandra Obula Reddy (@ObulaReddyYSRCP) July 5, 2025