HomeNewsAP Free Gas: ఏపీలో ఉచిత గ్యాస్ పథకం.. తాజా మార్గదర్శకాలు ఇవే!

AP Free Gas: ఏపీలో ఉచిత గ్యాస్ పథకం.. తాజా మార్గదర్శకాలు ఇవే!

AP Free Gas: ఉచిత గ్యాస్ పథకానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. దీపావళి నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టనుంది. 29 నుంచి ఉచిత గ్యాస్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. తాజాగా ఎందుకు సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేసింది. వాటి ఆధారంగా అర్హులు ఎవరో తెలిసిపోనుంది.ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.31 నుంచి డెలివరీ ప్రారంభిస్తారు.బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24 గంటలు,గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. తాను అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు అమలు చేయనున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 876 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి 2500 రూపాయలు లబ్ధి చేకూరనుంది. సిలిండర్ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో చెల్లిస్తే.. వాటిని 48 గంటల్లో డబ్బులు తిరిగి వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు.

* ఏడాదికి మూడు
ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తారు. మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబర్ 30 లోపు ఎప్పుడైనా పొందొచ్చు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ రెండింటితో పాటు ఆధార్ కార్డు అందజేయాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు ఉండి ఉచిత సిలిండర్ రాకపోతే.. టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అర్హులందరికీ ఉచిత గ్యాస్ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

* ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు చెల్లింపులు
ఈనెల 29న ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు 894 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి చెక్కులు అందించనున్నారు. ఈ పథకానికి ఏడాదికి 2684 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఐదేళ్లలో మొత్తం 13423 కోట్లు ఖర్చు కానుందని చెబుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఉచితంగా అందించనున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version